2014 సీన్ రిపీట్ : టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ...!?

ఒక విధంగా చూస్తే ఏపీ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పే రాజకీయ సమీకరణలుగా చూడాలని అంటున్నారు.

Update: 2023-12-29 13:17 GMT

ఏపీ రాజకీయాలలో ఇది సంచలన వార్తగా చూడాలి ఇప్పటిదాకా బీజేపీ టీడీపీ జనసేన కూటమి విషయంలో ఏమీ తేల్చలేదు, కానీ ఇపుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ కూటమిలోకి వచ్చేందుకు బీజేపీ పచ్చ జెండా ఊపేసింది. దాదాపుగా ఈ విషయంలో కీలక నిర్ణయం బీజేపీ పెద్దలు సానుకూలంగానే తీసుకున్నారని ప్రచారం సాగుతోంది.

ఒక విధంగా చూస్తే ఏపీ రాజకీయాలను కీలకమైన మలుపు తిప్పే రాజకీయ సమీకరణలుగా చూడాలని అంటున్నారు. ఇక 2014లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. జనసేన నాడు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చింది. 2024 ఎన్నికలలో మాత్రం జనసేన పోటీకి దిగుతోంది. ఈ మూడు పార్టీలు మరోసారి అలా కలవబోతున్నాయని అంటున్నారు.

ఇక ఏపీలో టీడీపీ కూటమితో పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు అందరి అభిప్రాయాలను తీసుకున్నారని అంటున్నారు. దాని మీద మెజారిటీ నేతలు సానుకూలంగా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. దాంతో కొత్త ఏడాదిలో బహుశా సంక్రాంతి లోపలనే మూడు పార్టీల మధ్య పొత్తుల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాడం ఉంది అని అంటున్నారు.

అలా కనుక చూస్తే టీడీపీ-జనసేనలతో బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారంగా ఉంది. ఇక ఈ కీలకమైన బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది అని అంటున్నారు. అదే విధంగా ఈ పొత్తు వల్ల మూడు పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం చేశారని అంటున్నారు. ఈ నివేదిక ఇపుడు కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద ఉందని అంటున్నారు. ఇక దాని మీద పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ పొత్తుల విషయంలో ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ జనసేనతో తమ పార్టీ పొత్తులో ఉందని చెప్పారు. టీడీపీతో పొత్తు మీద హై కమాండ్ డెసిషన్ తీసుకుంటుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీజేపీ ఆరు ఎంపీ సీట్లను అలాగే పన్నెండు దాకా ఎమ్మెల్యే సీట్లను కోరుతోంది అని అంటున్నారు. అవి కూడా తాము బలంగా ఉన్న చోటనే ఇవ్వాలని అడుగుతోందని అంటున్నారు. దీని మీద కూడా తెలుగుదేశం లో చర్చ సాగుతోంది అని అంటున్నారు. మొత్తామికి పొత్తు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కొత్త ఏడాదిలో ఉందని అంటున్నారు.

Tags:    

Similar News