తమ్ముళ్లలో టెన్షన్ పెరిగిపోతోందా ?

దీనికి కారణం ఏమిటంటే జనసేన కోరుకుంటున్న సీట్లలో చాలావరకు జనసేన అడుగుతుండటమే. ఈ టెన్షన్ ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర తమ్ముళ్ళల్లో కనబడుతోంది.

Update: 2023-10-27 17:30 GMT

రెండు పార్టీల మధ్య ఐక్య కార్యచరణ అమల్లోకి వస్తుండటంతో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. వైసీపీని ఓడించటమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితంవరకు రెండు పార్టీల మధ్య పొత్తు జరిగే పనికాదనే అనుమానాలుండేవి. అయితే తాజా రాజకీయ పరిణామాల్లో పొత్తు బంధం బలపడుతోందన్న విషయం అర్ధమవుతోంది. కాబట్టి ఇక మిగిలింది సీట్ల సర్దుబాటే అన్న ప్రచారం మొదలైంది. ఈ విషయంలో కూడా పవన్-లోకేష్ మధ్య చర్చలు అయిపోయాయని అధికారికంగా ప్రకటించటం ఒకటే మిగిలిందనే ప్రచారం తమ్ముళ్ళల్లో మరింత కలవరాన్ని కలిగిస్తోంది.

దీనికి కారణం ఏమిటంటే జనసేన కోరుకుంటున్న సీట్లలో చాలావరకు జనసేన అడుగుతుండటమే. ఈ టెన్షన్ ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర తమ్ముళ్ళల్లో కనబడుతోంది. టీడీపీ వర్గాల ప్రకారం పిఠాపురం, కాకినాడ, రాజమండ్రి, కొత్తపేట, పి గన్నవరం, మండపేట, నర్సాపురం, పెందుర్తి, భీమిలి, విశాఖ ధక్షిణం లాంటి చాలా నియోజకవర్గాలను జనసేన అడుగుతన్నదట. ఈ నియోజకవర్గాలన్నింటిలో దశాబ్దాలుగా టీడీపీ బలంగా ఉన్నవే. స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టుతో టీడీపీ రాజకీయమంతా తల్లకిందులైపోయిందనే చెప్పాలి.

చంద్రబాబు ఉండుంటే పొత్తుల్లో సీట్ల సంఖ్య, నియోజకవర్గాలన్నింటినీ డిసైడ్ చేసుండేవారు. ఇపుడు లోకేష్ కు అంత సీన్ కనబడటంలేదు. పైగా ఇదే సమయంలో పవన్ టీడీపీని కార్నర్ చేస్తున్నారు. దాంతో రాబోయే ఎన్నికల్లో జనసేనకు ఎన్ని సీట్లు వదులుకోవాల్సుంటుంది ? ఏ నియోజకవర్గాలను కోల్పోవాల్సోస్తుందో అనే టెన్షన్ తమ్ముళ్ళల్లో బాగా పెరిగిపోతోంది. పొత్తులను డిసైడ్ చేయటంలో చంద్రబాబు రేంజ్ వేరే విధంగా ఉండేది.

చంద్రబాబు అరెస్టుతో టీడీపీలో నాయకత్వ లోపం స్పష్టంగా బయటపడుతోంది. యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, రామానాయుడు లాంటి వాళ్ళలో ఎవరికి కూడా పొత్తు ఒప్పందాన్ని సాఫీగా ముగించేంత సీన్ లేదు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎవరికి పోటీచేసే అవకాశాలు పోతాయో అన్న బెంగ పెరిగిపోతోంది. దాదాపు నాలుగున్నరేళ్ళుగా ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేస్తే చివరకు టికెట్లను జనసేన తన్నుకుపోతుందేమో అన్న టెన్షన్ తమ్ముళ్ళల్లో పెరిగిపోతోంది. మరి సీట్ల సంఖ్య, నియోజకవర్గాల విషయం ఎప్పుడు బయటపడుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News