కేంద్ర కేబినెట్‌లో టీడీపీ ఎంపీలకు చోటు.. ఎవరెవరంటే!
ఇక, కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. గుంటూరు నుంచి తొలిసారి విజయం దక్కిం చుకున్న ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు.
కొత్తగా కొలువుదీరనున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఏపీలో టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ముందుగా ప్రచారంలో ఉన్నట్టుగా.. ముగ్గురికి కాకుండా... మోడీ ఇద్దరికి అవకాశం కల్పించారు. వీరిని కీలకమైన కేబినెట్ మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కేబినెట్ అంటే... అత్యంత కీలకమైన వర్గం. ప్రధాని నరేంద్రమోడీ నిత్యం పర్యవేక్షిస్తుంటారు. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా.. ఆయన వీరితో సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు.
కీలక నిర్ణయాలు.. కూడా కేబినెట్ తోనే చర్చిస్తారు. దీంతో తొలిసారి టీడీపీకి కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కడం నిజంగానే ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. ఇక, కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్న వారిలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. గుంటూరు నుంచి తొలిసారి విజయం దక్కిం చుకున్న ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఈ మేరకు వీరికి కేంద్రం నుంచి ఫోన్లు కూడా అందాయి. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు.. వీరు కూడా.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు.. తనతండ్రి ఎర్రన్నాయుడు హఠాన్మరణం తర్వాత.. రాజకీయాల్లోకి వచ్చారు. 2014, 2019లలో శ్రీకాకుళం నుంచి విజయం దక్కించుకన్నారు. పార్టీ తరఫునే కాకుండా.. రాష్ట్రం తరఫున కూడా..ఆయన పార్లమెంటులో మంచి గళం వినిపించారు. ఇక, గుంటూరునుంచి తొలిసారి పోటీ చేసిన.. ఎన్నారై.. పెమ్మసాని విజయం దక్కించుకున్నారు. ఆయనకు కేబినెట్ లో మంత్రి పీఠం దక్కడం.. ఆశ్చర్యమేనని చెప్పాలి.
ఇక, శాఖల విషయానికి వస్తే.. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు.. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు దక్కనున్నాయని తెలుస్తోంది. ఇక, పెమ్మసానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. వీరు ఆదివారం సాయంత్రానికి మోడీతోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.