బ్రాహ్మణి రావాలంటున్న టీడీపీ సీనియర్లు...!
ఈ విషయం మీద తాను లోకేష్ బాబు అరెస్ట్ అయితే పార్టీని నడిపించడానికి బ్రాహ్మణి ఉంటారని చెప్పానని మీడియా ముందు పేర్కొన్నారు. బ్రాహ్మణి నాయకత్వంలో తాము ముందుకు పోతామని ఆయన అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఇపుడు నాయకత్వ సమస్య ఒకటి చర్చకు వస్తోంది. నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నప్పటి నుంచి పార్టీకి ఎవరు పెద్ద అన్న దాని మీద సందేహాలు వస్తూనే ఉన్నాయి. నారా లోకేష్ అని ఒక వైపు కొందరు అంటే బాలయ్య అని మరి కొందరు అంటూ వచ్చారు. ఈ మధ్యలో సడెన్ గా నారా బ్రాహ్మణి ఎంట్రీ ఇచ్చారు.
ఇదంతా వ్యూహాత్మకమే అని అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత రిమాండ్ లో ఉన్నారు ఆయన ఇప్పట్లో రాకపోతే ఏమి అవుతుంది అంటే నారా లోకేష్ ఉన్నారని అంటున్నారు. దీంతో ఈ విషయం మీద టీడీపీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ వివరాలను చంద్రబాబుకు లోకేష్ కి అత్యంత సన్నిహితుడు అయిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియాతో పంచుకున్నారు.
ఢిల్లీలో చంద్రబాబు అరెస్ట్ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద వరస కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రానీయరు అని పార్టీలో చర్చ ఉందని అన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసు పెట్టడాన్ని ఆయన ఉదహరించారు. ఇక నారా లోకేష్ మీద కూడా చర్చ సాగింది అన్నారు.
ఈ విషయం మీద తాను లోకేష్ బాబు అరెస్ట్ అయితే పార్టీని నడిపించడానికి బ్రాహ్మణి ఉంటారని చెప్పానని మీడియా ముందు పేర్కొన్నారు. బ్రాహ్మణి నాయకత్వంలో తాము ముందుకు పోతామని ఆయన అంటున్నారు. ఎన్టీయార్ ఏ ముహూర్తాన టీడీపీని పెట్టారో కానీ ఈ పార్టీకి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా కూడా తట్టుకుని ముందుకు సాగుతుందని అయ్యన్న చెప్పుకొచ్చారు.
తమకు నాయకత్వ సమస్య లేదని ఆయన ధీమాగా చెబుతున్నారు. తాము బ్రాహ్మణి నాయకత్వంలో పనిచేస్తామని కూడా అయ్యన్న చెప్పడం విశేషం. తాను ఈ విషయంలో చెప్పిన తరువాత అంతటా పెద్ద ఎత్తున చర్చ సాగుతోందని అన్నారు.
ఇదిలా ఉంటే టీడీపీలో సీనియర్లు కొందరు అయితే నారా కుటుంబం నాయకత్వమే కోరుకుంటున్నారు అని తెలుస్తోంది. నందమూరి సైడ్ నుంచి బాలయ్య ఉన్నారు కానీ మద్దతు మాత్రం బ్రాహ్మణికే ఉందని అంటున్నారు. ఆమెను రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. రేపటి రోజున ఆమె నాయకత్వంలోనే టీడీపీని ముందుకు తీసుకుని వెళ్తామని కూడా గట్టిగా చెబుతున్నారు.
దీనికి కనుక విశ్లేషించుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు అర్ధమవుతాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య ఉందని వైసీపీ చూపించే ప్రయత్నం చేస్తోందని దాన్ని తిప్పి కొట్టడానికే ఇలా అని అంటున్నారు. అదే విధంగా పక్క పార్టీ నేతలను పొత్తు పేరుతో తెచ్చుకుని టీడీపీని నిలబెట్టుకుంటున్నారు అన్న కామెంట్స్ కి కూడా సీనియర్లు ఒప్పుకోవడంలేదు.
అందుకే బ్రాహ్మణి నాయకత్వం కావలని అంటున్నారు. ఆమె లోకష్ బాబు భార్య అని చెబుతున్నారు. బాలయ్య కుమార్తె అనడంలేదు. పైగా నారా బ్రాహ్మణి అని కూడా అంటున్నారు. ఇక బ్రాహ్మణి నాయకత్వం అన్న వార్తల పట్ల టీడీపీలో మద్దతు పెరుగుతోంది. లోకేష్ ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం బ్రాహ్మణిని ముందుకు తెచ్చేందుకు పార్టీలోని సీనియర్లు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వ్యూహాలకు తెర వెనక కార్యాచరణకు సీనియర్ల అండ ఎటూ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.