కోట్లు సంపాదిస్తున్న భర్తను వద్దన్న భార్య... రీజన్ ట్రెండింగ్ లో ఉంది!

కట్ చేస్తే... పేరు ప్రస్థావించని ఓ టెకీ.. అధిక పని గంటలు కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను తాజాగా పంచుకున్నారు.

Update: 2025-02-14 18:30 GMT

గత కొన్ని రోజులుగా.. యువత వారానికి ఎని గంటలు పనిచేయాలి అనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సంస్థల అధిపతుల వెర్షన్ ఒకలా ఉంటే.. ఉద్యోగుల అభిప్రాయం మరోలా ఉంది. ఈ సమయంలో ఓ టెక్కి తన స్వీయ అనుభవాన్ని నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. అధిక పని గంటల అనుభవం చర్చనీయాంశంగా మారింది.

అవును.. భారత్ లో యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సూచించారు! ఇక.. ప్రముఖ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ & టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ స్పందిస్తూ.. వారానికి 90 గంటలు పనిచేయాలని చెబుతూ.. ఎంతకాలం భార్యలను చూస్తూ కూర్చుంటారని ప్రశ్నించిన పరిస్థితి!

కట్ చేస్తే... పేరు ప్రస్థావించని ఓ టెకీ.. అధిక పని గంటలు కారణంగా తన జీవితంలో ఎదురైన సంఘటనను తాజాగా పంచుకున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ బ్లిండ్ ను వేదికగా చేసుకుని ఓ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా... తాను ఐటీ రంగంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని కలలు కన్నట్లు తెలిపాడు.

ఆ కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో మూడేళ్లు అహర్నిశలు కష్టపడినట్లు తెలిపాడు. ఈ సమయంలో వేతనం పెరిగే కొద్దీ, ప్రమోషన్స్ వచ్చే కొద్దీ పనికూడా పెరిగిందని తెలిపాడు. అది ఎంతలా ఉంటే... యూరప్ కంట్రీస్ తో పాటు ఆసియా దేశాల ఉద్యొగుల్ని సమన్వయం చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు.

దీనికోసం ఉదయం 7 గంటలకు ఆఫీస్ మీటింగ్స్ పేరు చెప్పి తన రోజు మొదలవ్వగా.. రాత్రి 9 గంటలకు కానీ ముగిసేది కదని తెలిపాడు. కొన్ని సందర్భాల్లో రోజుకి 14 గంటలూ కంప్యూటర్ తోనే కుస్తీ పడినట్లు తెలిపారు. దీంతో.. కష్టానికి ప్రతిఫలం దక్కింది.. ఏడాదికి ఏకంగా రూ.7.8 కోట్ల జీతం కూడా తీసుకున్నట్లు తెలిపాడు.

అయినా కూడా ఏమీ లాభం లేదని.. తన భార్య విడాకులు కావాలని అడుగుతోందని.. అందుకు కారణం తానే అని.. తన పని గంటలే అని చెప్పుకొచ్చాడు టెక్కి! తన పని ఒత్తిడి కారణంగా.. భార్య డెలివరీ సమయంలో కానీ.. కూతురు పుట్టిన తర్వాత కానీ.. ఆమె పుట్టిన రోజులకు కానీ తాను అటెండ్ కాలేకపోయాయని వెల్లడించాడు.

దీంతో... తన భార్య డిప్రెషన్ కి గురైందని.. ఆమెకు డిప్రెషన్ ఎక్కువైందని.. ఈ విషయంలో డాక్టర్ కు చూపించుకోవాలని కోరినా అది సాధ్యమయ్యేది కాదని.. చివరి ఈ బాధలు భరించలేక విడాకులు ఇవ్వమని అడిగిందని.. దీంతో.. ఇప్పుడు నాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదని సదరు టెకీ తన పరిస్థితిని పంచుకున్నాడు.

ఈ సందర్భంగా... తన జీవితంలో ఏమి చేస్తున్నానో.. ఏమి కోల్పోతున్నానో నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను.. కానీ, లేఆఫ్ తుఫాన్ కాలంలో నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా?.. కానీ ఇప్పుడు సంతోషంగా ఎలా ఉండాలి? అని తన పోస్టుకు ముగింపు పలికాడు.

ఈ నేపథ్యంలోనే... మీరు చెప్పినట్లుగానే ఇతడు వారానికి 70 నుంచి 90 గంటలు పని చేశాడు.. చివరికి ఏమి సాధించాడు.. అతడికి ఫైనల్ గా మిగిలిందేమిటి.. భార్య విడాకులు ఇవ్వమని అంటోంది.. అంటూ పైన పేర్కొన్న పెద్దల ఫోటోలు పెట్టి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు! ఈ నేపథ్యంలోనే.. ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ముఖ్యమో, పర్సనల్ లైఫ్ అంతే ముఖ్యం అని కామెంట్లు పెడుతున్నారు!

Tags:    

Similar News