తెలంగాణలో బీర్లకు గడ్డుకాలం.. పడిపోయిన అమ్మకాలు... ఎందుకో తెలుసా ?
తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయ్. ఎందుకిలా జరిగిందో తెలుసుకుందాం.;

సాధారణంగా మన తెలంగాణ మందుబాబులకు కేరాఫ్ అడ్రస్. సౌత్ ఇండియాలోనే కాదు.. మొత్తం ఇండియాలోనే మనోళ్లు మందు తాగడంలో టాప్ ఉంటారు. తలసరి మందు తాగే విషయంలో మన రాష్ట్రం ఏ పెద్ద రాష్ట్రానికీ తీసిపోదు. కానీ.. సీన్ మారింది గురూ! తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయ్. ఎందుకిలా జరిగిందో తెలుసుకుందాం.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సర్కార్ బీర్ల ధరలు అమాంతం 15శాతం పెంచేసింది. అంతే సంగతులు.. అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయ్. పోయిన ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో రాష్ట్రవ్యాప్తంగా బీర్ల అమ్మకాలు ఏకంగా 23శాతం తగ్గిపోయాయ్. మన హైదరాబాద్‌లో అయితే మరీ దారుణం.. 26శాతం పడిపోయాయ్!
ధరలు పెంచడానికి అసలు కారణం ఏంటంటే.. బీర్లు తయారు చేసే కంపెనీలు మొత్తుకున్నాయ్. 2019 నుంచి తమకు ఉత్పత్తి ఖర్చులు 35-40శాతం పెరిగిపోయాయని వాపోయాయి. బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) కూడా ధరలు పెంచమని సర్కార్‌ను కోరింది. అయితే.. వాళ్లు ఆశించినంతగా ధరలు పెరగలేదని BAI అంటోంది. ఇంకా పెంచాల్సి ఉందట!
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బీర్ల అమ్మకాలు పడిపోతే.. ఇంకో రకం మందు అమ్మకాలు మాత్రం పెరిగాయి. అదే.. మన ఐఎంఎఫ్ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్). అదే టైంలో దాని అమ్మకాలు ఏకంగా 10శాతం పెరిగాయి. అంటే మన తెలంగాణ మందుబాబులు బీర్ల ధరలు పెరగడంతో మెల్లగా హార్డ్ లిక్కర్‌కు షిఫ్ట్ అయిపోయారన్నమాట.
చూస్తుంటే.. బీర్ లవర్స్‌కు ధరల పెంపు బాగా గుచ్చుకున్నట్టుంది. అందుకే షాకింగ్‌గా హార్డ్ లిక్కర్ వైపు చూస్తున్నారు. కానీ.. ముందుంది ఎండాకాలం కదా.. అప్పుడు మళ్లీ బీర్ల అమ్మకాలు పెరుగుతాయేమో చూడాలి. ఎందుకంటే ఎండ దెబ్బకు చల్లగా బీర్ తాగితే వచ్చే కిక్కే వేరబ్బా.