'భూభారతి' కి ముహూర్తం రెడీ.. విమర్శల మాటేంటి?
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ఘట్టానికి తెరదీసింది. గతంలో బీఆర్ ఎస్ తీసుకువచ్చిన `ధరణి` పోర్టల్ స్థానంలో `భూభారతి` పేరుతో నూతన పోర్టల్ ను తీసుకువచ్చేందుకు సర్కారు సిద్ధమైం ది.;

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ఘట్టానికి తెరదీసింది. గతంలో బీఆర్ ఎస్ తీసుకువచ్చిన `ధరణి` పోర్టల్ స్థానంలో `భూభారతి` పేరుతో నూతన పోర్టల్ ను తీసుకువచ్చేందుకు సర్కారు సిద్ధమైం ది. ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ నెల 18న పోర్టల్‌ను సీఎం రేవం త్‌రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిపై అన్ని శాఖల అధికారులతోనూ ఆయన చర్చించారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి చెప్పడం గమనార్హం.
ఈ పోర్టల్ ద్వారా భూముల సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా అందబాటులో ఉండేలా చూస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు. గతంలో ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలు అన్యాయాలు కూడా జరిగాయని.. అసెంబ్లీ వేదికగా.. మంత్రి చెప్పారు. ఈ సమయంలోనే ధరణి వర్సెస్ భూభారతి మధ్య రాజకీయ వివాదం కూడా చోటు చేసుకుంది.
భూభారతి పేరుతో ఎన్నికలకు వెళ్లాలని.. బీఆర్ ఎస్ నాయకుడు సవాల్ విసరగా.. ధరణి పేరుతో మీరు ఎన్నికలకు వెళ్లాలని.. కాంగ్రెస్ ప్రతిసవాల్ రువ్వింది. ఇలా.. పోర్టల్ ప్రారంభానికి ముందే.. వేడెక్కించిన భూభారతి వ్యవహారం.. ఇప్పుడు ఏకంగా ప్రారంభదశకు చేరుకుంది. కాగా.. తొలి విడతలో దీనిని ప్రయోగాత్మకంగానే అమలు చేయనున్నారు. తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ భారతిపై అవగాహన కల్పిస్తారు.
వాస్తవానికి ఇది `స్వమిత్వ` అనే కేంద్ర ప్రాజెక్టు. దేశంలో భూముల పరిణామం, రైతులు, సాధారణ ప్రజల చేతిలో ఉన్న భూముల వివరాలను కేంద్రం సేకరిస్తోంది. గతంలో అయినా.. ఇప్పుడు అయినా.. ఈ ప్రాజెక్టు కింద.. 2026 నాటికి కేంద్రానికి లెక్కలు అప్పగించాలి. గతంలో ధరణి పేరుతో వివరాలు నమోదు చేశారు. ఇప్పుడు భూభారతి పేరుతో సేకరిస్తున్నారు. అంతే తేడా. ఇది ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియే కావడం గమనార్హం.