ఏడుగురు మావోయిస్టుల ఎన్ కౌంటర్.. అదే పీఎస్ పరిధిలో ఎస్సై ఆత్మహత్య!

అయితే.. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వ్యవహారాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు!

Update: 2024-12-02 08:20 GMT

ములుగు జిల్ల ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఏటూరు నాగారం మండలం చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు - మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు చెబుతున్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయని అంటున్నారు. అయితే.. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన వ్యవహారాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు! ఆ సంగతి అలా ఉంటే... ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అవును.. ఏటూరు నాగారంలో ఎన్ కౌంటర్ జరిగిన రాత్రే వాజేడు ఎస్సై హరీశ్ సూసైడ్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్ట్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు! దీంతో... సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు.

అయితే... ఎస్సై ఆత్మహత్యకు వ్యక్తిగత విషయాలే కారణాలని ఒకరంటుంటే... అతని ఆత్మహత్యకు ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News