ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నిక‌ల త‌ర్వాత తొలిసారి.. ఎందుకంటే!

మంగ‌ళ‌వారం రాత్రి కి ఆయ‌న కుటుంబ స‌మేతంగా ఏపీకి చేరుకోనున్నారు.

Update: 2024-05-21 15:16 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. వాస్త‌వానికి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న విశాఖ‌ప ట్నంలో నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న హైద‌రాబాద్ రాజ‌కీయాల్లోనే బిజీ అయిపోయారు. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కూడా.. స్తానికంగా ఉన్న స‌మ‌స్య‌లు, కేబినెట్ నిర్వ‌హ‌ణ‌.. వంటి అంశాల‌పైనే దృష్టి పెట్టారు. అయితే.. తాజాగా ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. రేవంత్ తొలిసారి ఏపీలో ప‌ర్య‌ట‌న‌కు రెడీ అయ్యారు. మంగ‌ళ‌వారం రాత్రి కి ఆయ‌న కుటుంబ స‌మేతంగా ఏపీకి చేరుకోనున్నారు.

వాస్త‌వానికిసోమ‌వారం.. ఆయ‌న కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించారు. అనేక అంశాల‌పై చ‌ర్చించారు. రైతుల బోన‌స్ స‌హా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు వంటి ప‌లు అంశాల‌పై కేబినెట్ స‌హ‌చ‌రుల‌తో చ‌ర్చించారు. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కూడా ఆయ‌న విశ్రాంతి ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం ఆయ‌న ఒక రోజు దైవ ద‌ర్శ‌నానికి కేటాయించిన‌ట్టు స‌మాచారం.ఈ క్ర‌మంలోమంగ‌ళ‌వారం రాత్రి ఆయ‌న ఏపీలో తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు రానున్నారు. త‌న కుటుంబంతో స‌హా ఆయ‌న తిరుమ‌లకు రానున్నారు. శ్రీవారిని ద‌ర్శించుకోనున్నారు.

ఎన్నిక‌ల త‌ర్వాత‌..ఏపీలో ప‌ర్య‌టిస్తుండడం ఒక విశేష‌మైతే.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత‌.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శిస్తుండ‌డం ఇదే తొలిసారి కావ‌డం మ‌రో విశేషం. ఏపీలోనూ ఎన్నిక‌లు ముగిసిన విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వారం రాత్రికే తిరుమ‌ల చేరుకోనున్న రేవంత్ రెడ్డి.. ఈ రాత్రికి ఇక్క‌డే బ‌స చేయ‌నున్నారు. బుధ‌వారం వేకువ జామున ప్ర‌త్యేక ద‌ర్శ‌నం చేసుకోనున్నారు. శ్రీవారం ద‌ర్శ‌నం అనంత‌రం..కుటుంబంతో స‌హా.. ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ చేరుకుంటారు.

కాగా, తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో రేవంత్ ఎన్నిక‌ల‌పై ఏం చెబుతారు? ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ ఎలాంటి ఫ‌లితం ఆశిస్తోంది? ఎలాంటి ఫ‌లితం రానున్న‌ద‌నే విష‌యంలో ఆయ‌న అంచ‌నా ఏమైనా చెబుతారా? అని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News