ప్రజాస్వామ్యం.. పరిణితి.. ఎన్నికల గురించి మాట్లాడుడా సారూ?

చెప్పేవాడు ఉండాలే కానీ వినేటోడు చెలరేగిపోతుంటారని ఊరికే అనలేదేమో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని వింటే ఈ విషయంలోని లోతు ఇట్టే అర్థమైపోతుంది

Update: 2023-11-18 04:24 GMT

చెప్పేవాడు ఉండాలే కానీ వినేటోడు చెలరేగిపోతుంటారని ఊరికే అనలేదేమో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని వింటే ఈ విషయంలోని లోతు ఇట్టే అర్థమైపోతుంది. మాటల మరాఠిగా పేరున్న కేసీఆర్ తన అవసరానికి తగ్గట్లుగా మాటల్ని ఎలా ట్విస్టు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆయన నోటి నుంచి వస్తున్న మాటల్ని విన్నంతనే విస్మయానికి కలిగించక మానదు.

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్ని ఖరీదైన ప్రక్రియగా మార్చటమే కాదు.. దేశంలో మరే రాష్ట్రంలో లేనంత హడావుడిని క్రియేట్ చేసిన కేసీఆర్.. తాజాగా ప్రజాస్వామ్యం గురించి.. దానికి ఉండాల్సిన పరిణితి గురించి చెప్పే మాటలు వింటే.. ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత గులాబీ సారుకు ఉందా? అన్నది ప్రశ్న. తాజాగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ''ఇంకా మన వద్ద ప్రజాస్వామ్య పరంగా రావాల్సినంత పరిణితి రాలేదు. పరిణితి సాధించిన దేశాల్లో ఎన్నికలు అనగానే.. గందరగోళం.. హడావుడి ఉండదు. మీరు కూడా.. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు? వారి వెనుక ఉన్న పార్టీలు ఏమిటి? దాని చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. గాడిద.. గుర్రం ఒక్కటనే విధంగా ఉండొద్దు'' అంటూ ఒకలాంటి క్లాస్ పీకటం గమనార్హం.

గులాబీ బాస్ చెబుతున్న ప్రజాస్వామ్యం.. పరిణితి గురించి మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యానికి ఒక ఉదాహరణగా చెప్పే అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే.. అక్కడి అధ్యక్ష ఎన్నికలు.. దాని హడావుడి మాటేమిటి? అన్న ప్రశ్నకు కేసీఆర్ చెప్పే సమాధానం ఏమిటి? పరిణితి సాధించిన దేశాల మాదిరి మనం కాలేదన్న కేసీఆర్.. గడిచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది ఆయనే అన్న విషయాన్ని ఎందుకు మిస్ అవుతారు?

ప్రజాస్వామ్యాన్ని పెంపొందించటం.. పరిణితి చెందేలా ప్రజల్ని పదేళ్లలో ఎందుకు తయారు చేయలేదు? అన్న ప్రశ్నకు సాయనేం చెబుతారు? నిజానికి 2014 తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఎంత ఖరీదైనవిగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ తరమా వాస్తవాల్ని వదిలేసి.. మాటలు చెప్పేస్తున్న కేసీఆర్ కు.. ప్రజల మెమరీ చాలా తక్కువగా ఉంటుందన్న బలమైన విశ్వాసం ఉందా? అన్న సందేహం కలుగక మానదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు.. ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ తరహా మాటలు నోటి నుంచి రావేమో?

Tags:    

Similar News