కూటమి హండ్రెడ్ డేస్ : జగన్ కి బాబు రిటర్న్ గిఫ్ట్ !

తెలుగుదేశం కూటమి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటారని ప్రజల వద్దకు వెళ్ళి తాము చేసిన కార్యక్రమాల గురించి చెబుతారని అంతా అనుకున్నారు.

Update: 2024-09-21 16:56 GMT

తెలుగుదేశం కూటమి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటారని ప్రజల వద్దకు వెళ్ళి తాము చేసిన కార్యక్రమాల గురించి చెబుతారని అంతా అనుకున్నారు. అదే జరుగుతోంది కూడా. అయితే బాబు ఈ వందవ రోజున ప్రతిపక్ష వైసీపీకి అతి పెద్ద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అనేక రకాలైన శ్వేత పత్రాలు విడుదల చేసి వైసీపీ అయిదేళ్ల పాలనలో ఏపీ ఎంతలా బ్రష్టు పట్టిపోయిందో మీడియా ముఖంగా బాబు చాటు చెప్పారు. అంతే కాదు ఏపీలో ఇటీవల సంభవించిన భారీ వరదలతో బెజవాడ మునిగింది. దాంతో బుడమేరు చుట్టూ ఆక్రమణలు జరిగాయని దానికి వైసీపీ ప్రభుత్వమే కారణం అని కూడా కూటమి పెద్దలు ఆరోపించారు.

ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని ఒక సెజ్ లో జరిగిన పేలుడు ఘటన వెనక కూడా వైసీపీ అయిదేళ్ళ పాలన నిర్వాకం ఉందని కూడా బాబు సహా అంతా ఆరోపించారు. ఇలా ఈ వంద రోజులలో వైసీపీ కూటమి వందకు వంద తప్పులను ఎత్తి చూపడంతో టీడీపీ కూటమి సర్కార్ పూర్తిగా సక్సెస్ అయింది.

దానిని పీక్స్ కి తీసుకుని వెళ్ళేలా వైసీపీ చేసిన వందవ తప్పు ఇదని అంటూ లడ్డూ ప్రసాదంతో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడారని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రకటన మాత్రం ఏకంగా ఏపీనే కాదు ప్రపంచాన్నే కుదిపేసింది. ఎక్కడ చూసినా తిరుపతి లడ్డూ గురించే చర్చించుకోవడం జరుగుతోంది.

మొదట్లో దీని సీరియస్ నెస్ తెలియక వైసీపీ కొంత లైట్ తీసుకున్నా కూడా ఆ తరువాత వేగంగా రియాక్ట్ అయింది. హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా సమగ్రమైన విచారణను ఈ ఘటన మీద జరిపించాలని కోరడం వైసీపీ తెలివైన ఆలోచనగానే చూడాలి. అదే టైం లో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసి విచారణ కోరుతామని జగన్ ప్రకటించారు.

అయితే వాటి సంగతి అలా ఉంటే గత నాలుగు రోజులుగా వైసీపీ బ్యాన్ జగన్ బ్యాన్ అంటూ టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంతో అపచారం చేసింది వైసీపీ అని నమ్మే వారు అంతా పెద్ద ఎత్తున నమ్ముతున్నారు. దీంతో వైసీపీ ఇరకాటంలో పడుతోంది.

ఇక జగన్ స్వతహాగా క్రిస్టియన్ కావడంతో కూడా ఈ వివాదంలో అగ్గి రాజుకోవడం, వైసీపీ మీద అన్ని వేళ్ళూ చూపించడానికి కారణం అవుతోంది. దానికి తోడు వైసీపీ అయిదేళ్ళ పాలనలో ఆలయాల విధ్వంసం వంటివి చోటు చేసుకోవడంతో ఆ పార్టీని ఒక ప్రధాన వర్గానికి దూరం చేసే రాజకీయం స్టార్ట్ అయిందా అన్న చర్చ సాగుతోంది.

వైసీపీకి ఇది కఠినమైన అగ్ని పరీక్షగానే అంటున్నారు. వైసీపీ ఇపుడు దీని నుంచి ఎలా బయటపడాలని చూస్తోంది. ఒక విధంగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పూర్తి స్థాయి విచారణ జరిగి అసలు నిజాలు బయటకు వస్తే అప్పటి సంగతేమో కానీ ప్రస్తుతానికి అయితే వైసీపీని జనంలో విలన్ గా ముందు పెట్టడంలో బాబు సక్సెస్ అయ్యారు అని అంటున్నారు.

ఆ విధంగా బాబు హండ్రెడ్ డేస్ కూటమి సెలబ్రేషన్స్ లో జగన్ కి ఇచ్చిన పవర్ ఫుల్ రిటర్న్ గిఫ్ట్ అని అంటున్నారు. సెంటిమెంట్ దెబ్బతో వైసీపీని కార్నర్ చేసేసారు. దీని నుండి విప్పుకుని బయటపడడం అన్నది వైసీపీకి ఇపుడు కత్తి మీద సాముగా ఉంది. వైసీపీ ఆత్మ రక్షణలో పడిపోయింది. ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఆ పార్టీలో అంతర్మధనం సాగుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు అపర చాణక్యుడు అన్నది మరో మారు రుజువు అయింది.

తనను ఏడాది క్రితం సెప్టెంబర్ నెలలో జైలులో పెట్టించిన జగన్ కి అదే సెప్టెంబర్ నెలలో కోలుకోలేని విధంగా రాజకీయ దెబ్బ తీశారు అని అంటున్నారు. చూడాలి మరి దీని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయో. దీనికి లాజికల్ ఎండ్ ఎలా పడుతుందో కూడా చూడాలి.

Tags:    

Similar News