మ‌ళ్లీ మున‌క‌: ముఖ్య‌మంత్రుల కంటిపై కునుకు క‌రువు!

అది కూడా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోనే ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ముఖ్య‌మంత్రులు.. మ‌రోసారి కంటిపై కునుకు లేకుండా ప‌నిచేస్తున్నారు.

Update: 2024-09-08 04:34 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఉప ముఖ్య‌మంత్రుల కంటిపై కునుకు కురువైంది. గ‌త ఆదివారం నుంచి ఈ ఆదివారం(8వ తేదీ) వ‌ర‌కు ప్ర‌కృతి శ‌పించిందా..? అన్న‌ట్టుగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా.. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అల్లాడిపోతున్నాయి. అంతో ఇంతో ప్ర‌కృతి శాంతించింద‌ని భావించిన స‌మ యంలో అక‌స్మాత్తుగా మ‌రోసారి అటు తెలంగాణ‌లోనూ.. ఇటుఏపీలోనూ కూడా.. వ‌ర్షాలు కురుస్తున్నాయి. అది కూడా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోనే ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ముఖ్య‌మంత్రులు.. మ‌రోసారి కంటిపై కునుకు లేకుండా ప‌నిచేస్తున్నారు.

విజ‌య‌వాడ‌లో కుండ‌పోత‌..

విజ‌య‌వాడ‌లో ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల‌తో ప‌లు శివారు కాల‌నీలు నీట మునిగాయి. దీంతో ల‌క్ష‌ల మంది జ‌ల‌ది గ్బంధం అయ్యారు. గ‌త ఆదివారం కుండ‌పోత వ‌ర్షంతో ఎదురైన బుడ‌మేరు వ‌ర‌ద తీవ్ర‌త వారం రోజుల పాటు.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు నానా తిప్ప‌లు చూపించింది. ఇక‌, శ‌నివారం బుడ‌మేర గండ్ల‌కు పూడ్చి వేత‌లు చేప‌ట్టారు. దీంతో ఒకింత ఊపిరి పీల్చుకోవ‌చ్చ‌ని అనుకున్నా.. ఆ వెంట‌నే భారీ వ‌ర్షాలు కుమ్మేస్తున్నాయి.

శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి కురుస్తున్న వర్షాల‌తో మ‌ళ్లీ వ‌ర‌ద ముంపు పెరిగిపోయింది. దీంతో సీఎం చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో శ‌నివారం రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. అనంత‌రం.. మ‌రోసారి వ‌ర‌ద పెరుగు తోంద‌న్న స‌మాచరంతో అక్క‌డ‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, అధికారులు వ‌ద్ద‌న‌డంతో ఆగిపోయి.. అక్క‌డిక‌క్క‌డే మ‌రోసారి డ్రోన్ విజువ‌ల్స్‌ను ప‌రిశీలించారు.

ఖ‌మ్మంలో మ‌రింత దారుణం..

తెలంగాణ‌లోని ఖ‌మ్మంలో మ‌రోసారి దారుణం చోటు చేసుకుంది.. వ‌ర‌ద‌లు త‌గ్గి.. ప్ర‌జ‌లు అంతో ఇంతో ఊప‌రి పీల్చుకుంటున్న స‌మ‌యంలో మ‌రోసారి ఆక‌స్మిక వ‌ర్షాలు.. ముంచెత్తాయి. శ‌నివారం రాత్రి నుంచి కురుస్తున్న వ‌ర్షాల‌తో మ‌ళ్లీ వ‌ర‌ద ప్ర‌భావం పెరిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ నుంచే ఇక్క‌డి స‌మ‌స్య‌ను స‌మీక్షించారు. ఆ వెంట‌నే డిప్యూటీ సీఎం, ఖ‌మ్మం జిల్లాకే చెందిన భ‌ట్టి విక్ర‌మార్క‌ను రంగంలోకి దింపారు.

భ‌ట్టి స‌హా మ‌రో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైద‌రాబాద్ నుంచి హుటాహుటిన ఖ‌మ్మానికి ప‌య‌న‌మ య్యారు. మున్నేరు వాగు మరోసారి పొంగే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన మంత్రులు అధికారుల‌ను సైతం నిద్ర లేపారు. మొత్తంగా.. అటుఏపీ, ఇటు తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రుల‌కు గ‌త వారం రోజులుగా నిద్ర‌లే క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News