తెలుగు ప్రజలకు బ్యాడ్ న్యూస్.. హైరిస్కు జోన్ లో తెలుగు రాష్ట్రాలు

విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతవాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-21 04:41 GMT

నిజంగానే తెలుగు ప్రజలకు బ్యాడ్ న్యూస్ గా దీన్ని చెప్పాలి. వాతావరణంలోచోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు హైరిస్కు జోన్ లోకి వచ్చాయని చెబుతున్నారు. దీని కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. కరువు లాంటి విపత్తులు ఎదుర్కొంటాయని.. అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భారతవాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలోనివాతావరణ పరిస్థితులపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వాతావరణ పరిస్థితులకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు హైరిస్కు జోన్ లో ఉన్న విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో హైరిస్కు జోన్ లో అసోం మొదటి స్థానంలో ఉండగా..రెండో స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండటం గమనార్హం.

మూడు నాలుగు స్థానాల్లో మహారాష్ట్ర.. కర్ణాటకలు ఉండగా.. ఐదో రాష్ట్రంగా బిహార్ నిలిచింది. వాతావరణ మార్పులతో 2000 నుంచి విపత్తుల తీవ్రత పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో ఉత్తర..తూర్పుప్రాంతంలో వర్షపాతం పెరుగుతోందని.. తూర్పు తెలంగాణలోని వరంగల్.. ఖమ్మం జిల్లాల్లో వర్షపాతం పెరగటంతో విజయవాడ.. క్రిష్ణా.. ఏలూరు ప్రాంతాలకు వరద పోటు ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వరదలు.. కరువు.. తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం.. విజయనగరం.. ఉభయ గోదావరి.. క్రిష్ణా.. గుంటూరు.. ప్రకాశం.. నెల్లూరు.. కడప జిల్లాలు ఎక్కువగా ప్రభావితం కానున్నట్లు పేర్కొనటం గమనార్హం.

ఇప్పటితో పోలిస్తే భవిష్యత్తులో విపత్తుల తీవ్రత మరింత ఎక్కువ అవుతుందన్న ఆయన కీలక సూచన చేవారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెయిన్ గేజ్ స్టేషన్ల వద్ద ఉన్న సమాచారాన్ని విశ్లేషించుకొని.. తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం కావాలని కోరారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. ఏపీలో ఉమ్మడి అనంతపురం.. చిత్తూరు.. గుంటూరు.. క్రిష్ణా.. ఉభయ గోదావరి.. విజయనగరం.. శ్రీకాకుళం జిల్లాల్లో వర్షపాతం పెరుగుతోందన్న ఆయన.. ఉమ్మడి విశాఖ.. కర్నూలు.. కడప.. నెల్లూరు జిల్లాల్లో మాత్రంవర్షపాతం తగ్గుతుందన్నారు.

Tags:    

Similar News