అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడి దుర్మరణం!

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... వాషింగ్టన్ లో పలువురు దుండగులు కాల్పులు జరిపారు.

Update: 2025-01-20 06:24 GMT

ఉన్నత చదువుల కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం అని కన్నవారిని, ఉన్న ఊరిని, అయినవారినీ వదిలి విదేశాలకు వెళ్తున్నారు నేటి యువత! ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న పలు ఘటనల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు చాలా జరగగ్గా.. తాజాగా అమెరికాలోని జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు యువకుడు మృతి చెందాడు.

అవును... అమెరికాలోని కాల్పుల ఘటనలో, రోడ్డు ప్రమాదాలో, జాత్యాహంకార దాడులో, సరదాగా విహారయాత్రలకు వెళ్లినప్పుడు జరుగుతున్న ప్రమాదాలో... కారణం ఏదైనా, కారకులు ఎవరైనా... విదేశాలకు వెళ్లి ఉన్నత స్థానాల్లో కనిపిస్తారని భావించిన చాలా మంది భారతీయ యువకులు మృత్యువాత పడుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ కి చెందిన యువకుడు మృతి చెందాడు.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... వాషింగ్టన్ లో పలువురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. మృతుడు చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నారు.

ఈ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ.. 2022 మార్చిలో అమెరికా వెళ్లి.. మాస్టర్స్ పూర్తి చేసి, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడట. అంటే.. మరికొన్ని రోజుల్లో కుమారుడు అమెరికాలో ఉద్యోగి అవ్వబోతున్నాడనే సమయంలో.. ఈ దారుణ వార్త తెలిసింది. దీంతో... అతడి మరణవార్త విన్న రవితేజ కుటుంబ సభ్యులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు!

Tags:    

Similar News