కలివిడి లేదు.. కుమ్ములాటే: బెజవాడ తమ్ముళ్ల తీరు...!
బెజవాడ టీడీపీకి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ టీడీపీకి కంచుకోటల్లాంటి రెండు నియోజకవర్గాలు ఉ న్నాయి.;

బెజవాడ టీడీపీకి ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడ టీడీపీకి కంచుకోటల్లాంటి రెండు నియోజకవర్గాలు ఉ న్నాయి. వీటిలో తూర్పు, సెంట్రల్ కీలకం. ఇక, పశ్చిమలో పార్టీ విజయం దక్కించుకోలేక పోతోంది. దీంతో మిత్రపక్షానికి కేటాయించింది. అయితే..ఆ రెండునియోజకవర్గాల్లో అయినా.. పార్టీ కుదురుగా ఉందా? అంటే.. కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఒకరంటే ఒకరికి పడదు. ఒక తీసుకున్న నిర్ణయాలపై మరొకరు దాట వేత ధోరణితో ఉన్నారు.
దీంతో రెండు కీలక నియోజకవర్గాలైన తూర్పు, సెంట్రల్‌లో టీడీపీ తమ్ముళ్ల మధ్య కలివిడి కన్నా.. కుమ్ము లాటలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల వ్యవహారం.. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మె ల్యే గద్దె రామ్మోహన్‌కు ఇబ్బందిగా మారింది. తన విజయానికి కృషి చేసిన కీలక నాయకులకు ఆయన నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని వాగ్దానం చేశారు. కానీ, ఈ జాబితాకు చంద్రబాబు నుంచి స్పందన రాలేదు. దీంతో వారు.. గద్దె కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు.
పైగా సోషల్ మీడియాలో గద్దె కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోం ది. అది కూడా వ్యక్తిగత అంశాలను తెరమీదకు తెచ్చి.. గద్దె రాజకీయాలను వారు టార్గెట్ చేస్తున్నారు. ఈ ప్రభావంతో గద్దె ఇమేజ్ కొంత డ్యామేజీ అవుతోందన్న చర్చ కూడా సాగుతోంది. ఇక, సెంట్రల్ విషయానికి వస్తే.. ఇక్కడి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు.. కొందరికి నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు. కానీ.. ఇది కూడా ఆయన రాజకీయాలు చిచ్చు పెట్టింది.
పార్టీ కోసం కన్నా.. తన వ్యక్తిగత అవసరాలకోసం కృషి చేసిన వారికే పదవులు ఇప్పించుకున్నారన్న చర్చ బొండా ఉమాపై ఎక్కువగా ఉంది. దీనిపై కొందరు నాయకులు ఇటీవల నారా లోకేష్‌కు ఫిర్యాదు కూడా చేశారు. పార్టీని నమ్ముకుని అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నామంటూ.. సెంట్రల్ నాయకులు కొందరు నారా లోకేష్‌ను కలిశారు. దీనిపై పరిశీలన చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఈ పరిణామాలతో రెండు కీలక నియోజకవర్గాల్లోనూ తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. మరి వీటిని సాధ్యమైనంత వరకు సర్దు బాటు చేయాల్సిన అవసరం ఉంది.