దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం... షాకింగ్ వీడియో!

అవును... దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా.. మయూన్ విమానాశ్రయం రన్ వే పై 7సి2216 విమానం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది.

Update: 2024-12-29 03:41 GMT

నూతన సంవత్సర వేడుకలకు ప్రపంచం సిద్ధమవుతోన్న వేళ వరుస విమాన ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల అజర్ బైజన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ జే2 - 8243 విమాన ప్రమాదంలో సుమారూ 40 మంది వరకూ గాయపడటం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.

అవును... దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా.. మయూన్ విమానాశ్రయం రన్ వే పై 7సి2216 విమానం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగి విమానం పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా మారింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 175 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో సుమారు 62 మంది మృతిచెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. బ్యాంకాక్ నుంచి ముమాన్ కు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా స్పందించిన దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోక్... ప్రయాణికులను రక్షించేందుకు అన్ని వనరులను సమీకరించాలని పిలుపునిచ్చారు. సిబ్బందిని రక్షించడానికి అన్ని సంబంధిత ఏజెన్సీలు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరించాలని ఓ ప్రకటనలో ఆదేశించారు.

Tags:    

Similar News