టెస్లా కార్లు తొలుత బెర్లిన్ నుంచి భారత్ కు.. ఎందుకుంటే?

ఏప్రిల్ నాటికి భారత్ కు టెస్లా కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్కు జరుగుతోంది.

Update: 2025-02-21 05:59 GMT

అమెరికాకు చెందిన ఈవీ కార్ల దిగ్గజం టెస్లా భారత రోడ్ల మీద పరుగులు తీసే రోజు దగ్గరకు వచ్చేసింది. దీనికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏప్రిల్ నాటికి భారత్ కు టెస్లా కార్లు ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ వర్కు జరుగుతోంది. ఇప్పటికే దేశీయంగా నియామకాల్ని షురూ చేసిన టెస్లా.. స్వయంగా తన కార్ల తయారీ సైతం షురూ చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పటం.. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడి నిష్ఠూరాలు చూసిన తర్వాత టెస్లా తయారీ భారత్ లో ఖాయమన్న విషయంపై స్పష్టత వచ్చింది.

ఈవీ కార్ల దిగుమతికి సంబంధించి గత ఏడాది మార్చిలో భారత సర్కారు కొత్త పాలసీ తేవటం తెలిసిందే. దీని ప్రకారం విదేశీ సంస్థలు రూ.4,150కోట్ల పెట్టుబడి హామీ ఇచ్చి 15 శాతం సుంకంతో ఏటా 8 వేల వాహనాల్ని దిగుమతి చేసుకోవచ్చు. అంతేకాదు.. దేశీయంగా తయారీలో స్థానిక ముడిసరుకును సమకూర్చుకోవాల్సి ఉంటుందన్న నిబంధన గురించి తెలిసిందే.

ఈ పాలసీకి అనుగుణంగా టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. దీనికి ముందుగా ఈ ఏప్రిల్ నుంచి టెస్లా తన కార్లను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలుగ బెర్లిన్ నుంచి కార్లను దిగుమతి చేయనుంది. దీనికి కారణం లేకపోలేదు. అమెరికాలో తయారైన కార్లు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. మన దేశంలో రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉన్న విషయం తెలిసిందే.

దీంతో.. రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కు అనువుగా ఉన్న కార్ల ఉత్పత్తి భారత్ కు పక్కనే ఉన్న చైనాలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే.. ఆ దేశంతో దిగుమతుల విషయంలో భారత్ తన అభ్యంతరాల్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీ నుంచి రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కార్లను తీసుకురావాలని టెస్లా భావిస్తోంది.

ఇక్కడ టెస్లా వై మోడల్ కార్లు తయారవుతున్నాయి. వీటినే భారత్ కు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా టెస్లా ప్లాంట్ ఏర్పాటు విషయంలో గుజరాత్.. మహారాష్ట్ర.. తమిళనాడు రాష్ట్రాలు ప్రధానంగా పోటీ పడుతన్నాయి. ఈ రేసులో ఏపీ.. తెలంగాణ ఉన్నప్పటికి.. వీటికి అవకాశం ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. టెస్లాకు ఉన్న అతి పెద్ద ఫ్యాక్టరీలో బెర్లిన్ లోని గిగా ఫ్యాక్టరీ ఒకటి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కార్లే.. తొలుత భారత్ లో పరుగులు తీసేది.

Tags:    

Similar News