కాబోయే ముఖ్యమంత్రి లోకేష్.. ఈసారి బిగ్ సౌండ్ తోనే
అంతే కాదు ఎవరికి నచ్చకపోయినా అంటూ కూడా మా లోకేష్ బాబే సీఎం అని బిగ్ సౌండ్ చేశారు
ఏపీకి కాబోయే సీఎం నారా లోకేష్, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదే అని టీడీపీ మంత్రి టీజీ భరత్ కుండబద్దలు కొట్టారు. లోకేష్ కి ఉన్న విజనరీ ఆయన హైలీ ఎడుకేటెడ్ బ్యాక్ గ్రౌండ్ ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా టీడీపీని మరిన్ని దశాబ్దాల పాటు ఏపీని పాలించేలా చేస్తాయని ఆయన ఫుల్ క్లారిటీతో చెప్పారు. అంతే కాదు ఎవరికి నచ్చకపోయినా అంటూ కూడా మా లోకేష్ బాబే సీఎం అని బిగ్ సౌండ్ చేశారు
దేశం కాని దేశంలో ప్రవాసంలో టీజీ భరత్ చెప్పిన ఈ మాట యావత్తు టీడీపీ శ్రేణులలో సరికొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. ఇక స్విట్జర్లాండ్ జ్యూరిచ్ లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో అయితే టీజీ భరత్ చేసిన ఈ కీలక ప్రకటనతో మొత్తం హాల్ అంతా ఈలలు చప్పట్లతో మారు మోగిపోయింది.
ఏపీలో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలలో లోకేష్ కంటే అత్యున్నత విద్యావంతుడు ఎవరూ లేరని కూడా టీజీ భరత్ చెప్పడం విశేషం. స్టాండ్ ఫర్డ్ నుంచి చదివిన వారు లోకేష్ తప్ప ఎవరూ లేరని కూడా టీజీ స్పష్టం చేశారు.
పార్టీ మీద లోకేష్ కి పూర్తి అవగాహన ఉందని సీనియర్లు జూనియర్లు ఇలా పార్టీలో మొత్తం వ్యవహారాల మీద కూడా ఆయనకు అన్ని తెలుసు అన్నారు. అంతే కాదు లోకేష్ కి దూరదృష్టి కూడా చాలా ఎక్కువ అన్నారు. అందువల్ల కాబోయే సీఎం లోకేష్ అని ఆలా బల్ల గుద్దీ మరీ చెప్పేసారు. టీడీపీ నుంచి ఇంత క్లారిటీగా చెప్పిన నాయకుడు బహుశా మరొకరు లేరేమో.
ఇంతకీ ఈ దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో పాటే ఉన్న టీజీ భరత్ అక్కడ పాల్గొన కార్యక్రమంలో ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో బాబు చినబాబు సమక్షంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ టీడీపీకే కాదు ఏపీ రాజకీయానికి కూడా సరికొత్త మలుపుగా పిలుపుగా చెబుతున్నారు
మంత్రి టీజీ భరత్ లోకేష్ ని ఫ్యూచర్ ఆఫ్ ది పార్టీ అని భరత్ పేర్కొనడంతో పసుపు పార్టీ పరవశిస్తోంది. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ నాయకులు వరుసగా కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దీని మీద పార్టీ హై కమాండ్ కాస్తా సీరియస్ అయి ఆ ప్రకటనలు ఆపాలని కోరింది.
అయితే బాబు చినబాబు సమక్షంలో మాత్రం టీజీ భరత్ లోకేష్ ని ఉప ముఖ్యమంత్రి అని అనలేదు, ఏకంగా సీఎం అనేశారు. అయితే కాబోయే సీఎం అని ఆయన అన్నారు. అంటే అది ఎపుడు రేపా ఎల్లుడా 2029లోనా అన్నది తెలియదు కానీ బాబు తరువాత లోకేష్ బాబు తరువాత అన్న మాటను క్లారిటీగా చెప్పడం ద్వారా టీడీపీ శ్రేణులలో జోష్ ని పెంచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇంతలా లోకేష్ ని ఫోకస్ చేస్తూ ఈ తరహా ప్రకటనలు ఎవరూ ఇవ్వలేదు. ఇపుడు టీజీ భరత్ దానిని ఇవ్వడం ద్వారా టీడీపీ శ్రేణులు ఏదైతే కోరుకుంటున్నాయో అది జరిగి తీరుతుందన్న బలమైన సందేశాన్ని పంపించారు అని అంటున్నారు.