టీజీ09 9999 నంబరు ధర ఎంతో తెలిస్తే నోట మాట రాదంతే
దీనికి సంబంధించి టీజీ 09 9999 నెంబరు కోసం సోని ట్రాన్స్ పోర్టు సొల్యూషన్స్ సంస్థ వారు ఏకంగా రూ.25,50,002 బిడ్డింగ్ గా పెట్టి ఆ నంబరును సొంతం చేసుకున్నారు.
ఖరీదైన కారును కొనటం ఒక ఎత్తు. దానికి నచ్చిన నెంబరును సొంతం చేసుకోవటం పడే పాట్లు అన్ని ఇన్ని కావు. బోలెడన్ని నెంబర్లు ఉన్నా.. కొన్ని నెంబర్ల మీద సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆశ పడుతుంటారు.
ఆ నంబర్ల కోసం ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. అందుకే.. అలాంటి ఫ్యాన్సీ నెంబర్లను వేలంలో విక్రయిస్తుంటారు. తాజాగా తెలంగాణ రవాణా శాఖ నిర్వహించిన నంబర్ల వేలంలో ఒక నెంబరుకు రికార్డు స్థాయి ధర లభించింది. టీఎస్ కు బదులుగా టీజీ సిరీస్ ను స్టార్ట్ చేయటం తెలిసిందే.
రేవంత్ సర్కారు కొలువు తీరిన తర్వాత అప్పటివరకు ఉన్నటీఎస్ కు బదులుగా టీజీ సిరీస్ ను మొదలుపెట్టటం.. దీనికి సంబంధించి టీజీ 09 9999 నెంబరు కోసం సోని ట్రాన్స్ పోర్టు సొల్యూషన్స్ సంస్థ వారు ఏకంగా రూ.25,50,002 బిడ్డింగ్ గా పెట్టి ఆ నంబరును సొంతం చేసుకున్నారు. నిజానికి ఈ నెంబరుకు పలికిన మొత్తానికి ఖరీదైన కారు వచ్చేయటం గమనార్హం.
ఇంత ధర పెట్టి కొన్న నెంబరును ఉంచే వాహనం వివరాల్లోకి వెళితే.. టయోటా ల్యాండ్ క్రూజర్ ఎల్ఎక్స్ కోసం పెట్టినట్లుగా చెబుతున్నారు.ఈ నెంబరుతోపాటు మరికొన్ని ఫ్యాన్సీ నెంబర్లను వేలంలో ఉంచారు. ఈ వేలంలో ఒక్క రోజులో రవాణా శాఖకు రూ.43.70 లక్షల ఆదాయం సమకూరింది. ఏమైనా.. నంబర్ల మోజు సర్కారు ఖజానాకు భారీగా కాసుల్ని తెచ్చి పెడుతుందని చెప్పక తప్పదు.