125 సొంత మొసళ్లను చంపేశాడు.. ముందుచూపుకు ప్రశంసలు అందుకున్నాడు!

అవును... ప్రజల హితం కోరి థాయ్ ల్యాండ్ కు చెందిన ఓ మొసళ్ల పెంపకందారుడు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

Update: 2024-09-29 04:33 GMT

కొంతమంది జనం పూర్తిగా స్వార్థంగా బ్రతుకుతుంటే.. మరికొంతమంది మాత్రం సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడు పడవోయి అనే గురజాడ అప్పారావు రాసిన లైన్లను ఫాలో అవుతూ జీవిస్తుంటారు. తాజాగా థాయ్ ల్యాండ్ లోని ఓ వ్యక్తి ఇలానే ఆలోచించి రాబోయే సమస్య గురించి ముందుజాగ్రత్త తీసుకున్నాడు.. తన మొసళ్లను తానే చంపేశాడు.

అవును... ప్రజల హితం కోరి థాయ్ ల్యాండ్ కు చెందిన ఓ మొసళ్ల పెంపకందారుడు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తనకు జరిగే నష్టం కంటే.. ప్రజలకు జరిగే ప్రమాదం ఎక్కువని భావించి అభినందించదగిన ఆలోచన చేశాడు. దీంతో.. అధికారులతో పాటు ప్రజలందరి ప్రశంసలూ పొందుకుంటున్నాడు.

వొవరాళ్లోకి వెళ్తే.. థాయ్ ల్యాండ్ కు చెండిన నత్థపక్ ఖుంకడ్ (37) అనే మొసళ్ల పెంపకందారుడు జనహితం మేరకు అభినందించదగిన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల సంభవించిన వరదలతో తాను మొసళ్లను పెంచుతున్న ఎన్ క్లోజర్ గోడ దెబ్బతిని, బలహీన పడింది. ఫలితంగా... ఆ గోడ ఎప్పుడైన కూలిపోవచ్చని ఫిక్సయ్యాడు.

నిజంగా ఆ ఎన్ క్లోజర్ గోడ కూలిపోతే అందులో ఉన్న ప్రమాదకరమైన మొసళ్లన్నీ వరదనీటిలోకి వెళ్లి జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని అతడు ఊహించాడు. ఈ సమయంలో జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో... ఆ అధికారులు చెప్పిన సూచనల మేరకు సుమారు 125 మొసళ్లకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు.

సెప్టెంబర్ 21న థాయ్ ల్యాండ్ ఉత్తరప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ సమయంలో.. నత్థపక్ మొసళ్ల ఫామ్ ను కూడా వరద తాకింది. దీంతో అతడి మొసళ్ల ఎన్ క్లోజర్ గొడ బాగా దెబ్బతింది. అది పూర్తిగా కూలితే... అందులోని మొసళ్లన్నీ సమీపంలోని జనావాసాల్లోకి ప్రవేశించి జనాలను చంపేస్తాయని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ సమయంలో కుటుంబ సభ్యులకు విషయం చెప్పి, అధికారుల సూచనల మేరకు 125 మొసళ్లకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. ఈ విధంగా అతడు తీసుకున్న నిర్ణయంపట్ల స్పందించిన అధికారులు.. ఇది అత్యంత ధైర్యంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయమని ప్రశంసిస్తున్నారు.

కాగా... థాయ్ ల్యాండ్ లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. ఇక్కడ ఎక్కువగా సియామిస్ అనే అరుదైన రకం మొసళ్లను ఎక్కువగా పెంచుతుంటారు. వీటి చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్ తో పాటు ఇతరదేశాలకు పంపిస్తుంటారు. ఈ దేశంలో వెయ్యికిపైగా మొసళ్ల పెంపకందారులున్నారు!

Tags:    

Similar News