దొంగలకెళ్లా మంచి దొంగోడు.. ఇంతకీ ఏం చేశాడంటే..?
ఏదిఏమైనా చివరకు తను వచ్చిన పనిని చేసుకొని వెళ్తుండడం వింటుంటాం.
దొంగతనాలు పలు రకాలు. ఒక్కో దొంగ.. ఒక్కో విధంగా దొంగతనాలు చేస్తుంటారు. కొందరు టెక్నాలజీని వాడుతుంటారు. మరికొందరు మైండును వాడుతుంటారు. ఏదిఏమైనా చివరకు తను వచ్చిన పనిని చేసుకొని వెళ్తుండడం వింటుంటాం. అయితే.. యూకేలో ఓ దొంగ చేసిన పనికీ ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు.
ఏదైనా వస్తువులను, నగదు, బంగారం చోరీ చేసేందుకు దొంగలు కొన్నికొన్ని సందర్భాల్లో హత్యలకూ వెనుకాడరు. ఇంకొందరు అయితే బెదిరించి, గాయపరిచి కావాల్సిన డబ్బు, బంగారం దోచుకెళ్తుంటారు. అయితే.. యూకేలో మాత్రం ఈ దొంగ ఇంట్లోని పనులన్నీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇల్లంతా నీటుగా సర్దడమే కాకుండా.. ఇంట్లో వారి కోసం ఏకంగా భోజనం కూడా తయారుచేసి వెళ్లిపోయాడు. వెళ్తూ.. వెళ్తూ ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ’ అంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టి మరీ వెళ్లాడు.
యూకేలోని మాన్‌మౌత్ షైర్‌లో ఈ ఘటన జరిగింది. డేమియన్ వాజినిలోవిక్జ్ అనే దొంగ.. ఈ వెరైటీ దొంగతనానికి పాల్పడ్డాడు. మాన్‌మౌత్‌షైర్‌లో ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్లిన అతను.. మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు పసిగట్టాడు. దాంతో ఆ యువతికి సంబంధించిన బట్టలన్నీ ఉతికాడు. అంతేకాకుండా ఇంటి పనినంతా చేశాడు. కిచెన్, ఫ్రిజ్ అన్నీ నీట్‌గా సర్దాడు.
ఇంటి కింద ఫ్లోర్, పైన ఫ్లోర్ కూడా తుడిచాడు. అంతటితో ఆగకుండా.. ఆ యువతి ఆఫీసు నుంచి అలసిపోయి వస్తుందని భావించిన డేమియన్ భోజనం కూడా రెడీ చేశాడు. కేవలం ఇంట్లోని రెడ్ వైన్‌ను మాత్రం తాగాడు. అయితే.. ఆ సీసా, గ్లాసును మాత్రం అక్కడే టేబుల్‌పై వదిలేసి వెళ్లాడు. ఇంటికి వచ్చిన ఆ యువతి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత ఒంటరిగా ఉండలేక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయింది. రెండు వారాల తర్వాత డేమియన్ దొరికినట్లు పోలీసులు ఆ యువతికి ఫోన్ చేశారు. దాంతో తన టెన్షన్ అంతా పోయిందని ఆ యువతి పేర్కొంది.