అంతుచిక్కని సీక్రెట్ బద్ధలు.. గాలిలో నీటి తయారీని తొలిసారి చూశారు

అందుకు భిన్నంగా తొలిసారి నీటి పుట్టుకను చూసేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

Update: 2024-10-07 19:30 GMT

నీరు పుట్టేది ఎలా అన్నంతనే వచ్చే సమాధానం హైడ్రోజన్.. ఆక్సిజన్ పరమాణువుల కలయికతోనీరు తయారు అవుతుందన్నది సైన్సు చెప్పే మాట. మరి.. దానికి ఆధారం ఏంటి? అంటే శాస్త్రీయంగా చాలానే చెబుతారు. అలా చెప్పే వారికి ఒక్క ప్రశ్నను సంధిస్తే చాలు.. నోటి నుంచి మాట రాలేని పరిస్థితి. ఇంతకూ ఆ ప్రశ్న ఏమంటే.. నీటి పుట్టుకను కళ్లతో చూశారా? అంటూ ఎవరైనా నో చెప్పాల్సిందే. అందుకు భిన్నంగా తొలిసారి నీటి పుట్టుకను చూసేసిన వైనం ఆసక్తికరంగా మారింది. సూక్ష్మస్థాయిలో జరిగే ఈ ప్రక్రియను నేరుగా శాస్త్రవేత్తలు చూసేయటం ద్వారా.. కరవు ప్రాంతాల్లో నీటిని వేగంగా తయారు చేసేందుకు వీలు కలగనుంది.

ఇంతకూ నీటి తయారీని ఎలా చూశారు? దానికి శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటి? నానో పరిమాణంలో నీటి బుడగలు రూపుదిద్దుకోవటాన్ని సైంటిస్టులు చూశారు. పలీడియం అనే అరుదైన మూలకం నీటిని వేగంగా ఉత్పత్తి చేస్తుందన్న విషయం 1900లలోనే సైంటిస్టులకు తెలుసు. అయితే.. ఇదెలా జరుగుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే వీలున్నా.. కంటితో చూశావా? అన్నప్పుడు మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.

అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ వర్సిటీ శాస్త్రవేత్తలు నీటిని పుట్టే రీతిని కళ్లతో చూశారు. గాల్లో అణువుల తీరును ప్రత్యక్షంగా విశ్లేషించేందుకు కొత్త విధానాన్ని కనుగొన్నారు. తేనెతుట్టె షేప్ లోని నానో రియాకర్టర్లలో వాయు పరిమాణువులను ఒడిసిపట్టే పలుచటి పొరను డెవలప్ చేశారు. హై వాక్యూమ్ ట్రాన్స్ మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులతో వీక్షించే సామర్థ్యాన్ని సాధించారు. మనిషి ప్రత్యక్షంగా చూసిన అత్యంత చిన్నపాటి బుడగ ఆవిర్భావ ప్రక్రియను తమ కంటితో చూసినట్లుగా సైంటిస్టులు పేర్కొన్నారు.

పలీడియం సాయంతో నీటి ఉత్పత్తి ప్రక్రియను స్వయంగా పరిశీలించిన సైంటిస్టులు.. తమ పరిశోధనలో భాగంగా తొలుత హైడ్రోజన్ ను.. ఆ తర్వాత ఆక్సిజన్ ను జోడించారు. హైడ్రోజన్ పరిమాణవులు చాలా చిన్నవిగా ఉండటంతో

పలీడియం పరిమాణవుల మధ్యకు చొచ్చుకెళ్లి.. వాటిలో ఇమిడిపోతాయి. దీంతో ఆ లోహపు పొర వెడల్పుగా పెరుగుతుంది. ఇలా పలీడియాన్ని హైడ్రోజన్ తో నింపిన తర్వాత పరిశోధకులు ఆక్సిజన్ ను కలిపారు. దీంతో హైడ్రోజన్ బయటకు వచ్చి.. ఆక్సిజన్ తో చర్య జరిపి.. నీటి ఉత్పత్తి చేసే ప్రక్రియను కంటితో చూశారు. ఈ విధానాన్ని కరవు ప్రాంతాల్లోనే కాదు.. భవిష్యత్తులో అంతరిక్షంలోనూ ఇదే తీరులో నీటిని తయారు చేసుకునే వీలుంది. పలీడియం ధర ఎక్కువే. అయితేనేం.. నీటి ఉత్పత్తి ప్రక్రియలోని ఫలకాల్ని రీసైకిల్ చేసుకోవటం ద్వారా పదే పదే వినియోగించే వీలు ఉంటుంది.

Tags:    

Similar News