తొక్కిసలాటలో 116 మంది మృతి... అసలు కారణం ఇదే!

అవును... ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతూ వెళ్లింది.

Update: 2024-07-02 17:09 GMT

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. అత్యంత విషాదకరంగా పరిణమించిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 116కి చేరిందని చెబుతున్నారు. ఇంకా అనేక మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైందనే చెప్పాలి.

అవును... ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకూ పెరుగుతూ వెళ్లింది. ఈ క్రమంలో ఈ సంఖ్య 116కి చేరిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మృతదేహాలన్నీ ఆస్పత్రికి చేరాయని.. పోస్ట్ మార్టం ప్రక్రియలు జరుగుతున్నాయని.. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో ఈ ఘోరానికి గల కారణాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా... ఉత్తరప్రదేశ్ కి చెందిన నారాయణ్ సాకార్ హరి.. "భోలే బాబా"గా ప్రసిద్ధి! ఈ నేపథ్యంలో ఎటా జిల్లా పటియాలి తహసీల్ లోని బహదూర్ గ్రామానికి చెందిన ఆయన బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడట. కాలక్రమంలో ఇతడు ఆధ్యాత్మిక బాట పట్టి.. సమాజ హితం కోసమే ఈ మార్గన్ని ఎంచుకున్నట్లు చెబుతూ... ఆఖరికి బాబాగా అవతారమెత్తాడని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా హాథ్రస్ జిల్లాలో ప్రతీ మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటారట. ఈ కార్యక్రమాలకు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారని చెబుతారు. కేవలం యూపీలోనే కాకుండా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ మొదలైన రాష్ట్రాల్లోనూ ఈ భోలే బాబాకు లక్షల మంది అనుచరులు ఉన్నారని చెబుతారు.

Read more!

ఈ క్రమలోనే తాజాగా ఈసారి ఫుల్ రాయ్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సమయంలో... భోలే బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారని.. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. దీంతో.. తొక్కిసలాటలో ఊపిరాడక 116 మంది ప్రాణాలు విడిచారని... అనేక మంది గాయపడ్డారని చెబుతున్నారు.

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..!:

తాజాగా హాథ్రస్ లో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రధాని స్పందించారు. ఈ ఘటనలో గాయపడిన వారంతా తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News

eac