అప్పుడు టీడీపీ- ఇప్పుడు వైసీపీ.. సేమ్ టు సేమ్
ఎందుకంటే.. ఒకప్పుడు టీడీపీ ఏ ఆరోపణలు అయితే చేసిందో.. ఇప్పుడు వైసీపీ కూడా అదే ఆరోపణలు చేస్తూ.. కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే కూటమి కావడంతోపాటు..
ఒకప్పుడు టీడీపీ నేతలు కేంద్రాన్ని ఆశ్రయించారు. తమకు వైసీపీ ప్రభుత్వం రక్షణ కల్పించలేక పోతోంద ని.. ఉన్న సెక్యూరిటీని కూడా తీసేస్తోందని గగ్గోలు పెట్టారు. చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించిన జోగి రమేష్ వ్యవహారం సహా.. తమ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని కూడా అప్పటి విపక్ష నాయ కుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు హస్తినలో ఎలుగెత్తి చాటారు. ఫలితంగా .. కేంద్రం పూచీతీసుకుని.. భద్రతను కల్పించే పరిస్థితి వచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి ఎదురైంది. తమకు రక్షణ లేకుండా చేస్తున్నారంటూ.. రాజం పేట ఎంపీ, వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డి పార్లమెంటు వేదికగా చెప్పడమే కాకుండా. .కేంద్ర హోం శాఖకు ఇక్కడ జరిగిన పరిణామాలను వివరించారు. తమకు రక్షణ ఏదని నిలదీశారు. ఉన్న భద్రతను కూడా తగ్గించేశారని చెప్పుకొచ్చారు. దీంతో హుటాహుటిన మారు మాట్లాడకుండా.. కేంద్రం ఆయనకు భద్రతను కల్పించింది. ఈ పరిస్థితిని సాధారణంగా చూడలేం.
ఎందుకంటే.. ఒకప్పుడు టీడీపీ ఏ ఆరోపణలు అయితే చేసిందో.. ఇప్పుడు వైసీపీ కూడా అదే ఆరోపణలు చేస్తూ.. కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీయే కూటమి కావడంతోపాటు.. ఢిల్లీ స్థాయి లో ఇక్కడి పరిణామాలను వైసీపీ దుమారం రేపుతున్న నేపథ్యంలో మోడీ సర్కారుకు ఇది ఇబ్బందిగా మారింది. మోడీ చుట్టూ ఉన్న ఇండియా కూటమి పక్షాలు.. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రత్యర్థులకు రక్షణ లేదంటూ విమర్శలు సంధిస్తున్నాయి.
ఇది కేంద్రానికి తలనొప్పిగా మారడంతోపాటు.. ఏపీవంటి రాష్ట్రాలకు కూడా మంచిది కాదన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఇది అధికార పక్షాలకు బాగానే ఉండి ఉండొచ్చు. తమకు అన్యాయం చేశారు కాబట్టి.. తాము మాత్రం ఎందుకు న్యాయం చేయాలన్న భావన కూడా ఉండి ఉండొచ్చు. కానీ, ప్రజాహిత కోణంలో చూసినప్పుడు.. జగన్‌కు చంద్రబాబు సమానుడు కాలేరు. బాబు గ్రాఫ్‌ను జగన్‌ను అందుకోలేరని చెబుతున్నప్పుడు.. ఇలా చేయడం ద్వారా.. సదరు గ్రాఫ్‌ను సమం చేస్తున్నారా? లేక ఇంకా కుదించుకుంటున్నారా? అన్నది ప్రశ్న.