చంద్రుడి మట్టిని తెస్తున్న రోజుల్లో.. నకిలీ బాబా పాద ధూళికి తొక్కిసలాటనా?

మనిషి అనుకుంటే సాధించేంది ఏమీ లేదని దీని ద్వారా నిరూపితం అవుతోంది.

Update: 2024-07-03 16:30 GMT

ప్రపంచం ఎటు పోతోంది..? ఓవైపు ఆకాశమే హద్దుగా వెళ్తున్న వ్యోమగాములు.. మరోవైపు చంద్ర మండలంపై ఉన్న మట్టినీ తెస్తున్న యంత్రాలు.. చిన్నప్పటి కథల్లోని చందమామను అందుకోగలమా? అని అందరికీ సందేహం. కానీ, దాని మీదున్న మట్టిని తేవడమే కాదు.. ఎప్పుడూ చూడని ఆవలి వైపునూ తాకి వస్తున్నాం. మనిషి అనుకుంటే సాధించేంది ఏమీ లేదని దీని ద్వారా నిరూపితం అవుతోంది.

ఎలాన్ మస్క్ పుట్టిన కాలంలోనే ఉన్నామా..?

‘‘మరో 30 ఏళ్లలో అంగారక గ్రహంపై ఏర్పాటయ్యే నగరంలో మనుషులు జీవిస్తారు’’ ఇదీ టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ రెండు నెలల కిందట చెప్పిన మాట ఇది. ‘నేను అంగారక గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నా’ అంటూ కూడా మస్క్‌ ఓసారి చెప్పారు. మనుషులు మరో గ్రహంపై బతకాలనేది మస్క్‌ గట్టిగా వాదిస్తుంటారు. ఆయన ఆ దిశగా ప్రయత్నాలు కూడా గట్టిగా సాగిస్తున్నారు. మరో 30 ఏళ్లలో అంగారకుడిపై నగరం ఏర్పడటమే గాక.. మనుషులు కూడా జీవిస్తారని అంచనా వేశారు. ఐదేళ్లలోనే అంగారకుడిపైకి మానవ రహిత యాత్ర విజయవంతం అవుతుంది. పదేళ్లలోమనుషులను పంపిస్తా. 20 ఏళ్లలో ఓ నగరాన్నీ నిర్మిస్తాం. 30 ఏళ్లలో అక్కడ సురక్షిత నాగరికత అని చెప్పారు. ఇలాంటి ఊహలకు అందని విధంగా ఆలోచించే వ్యక్తులు ఉన్న కాలంలోనూ తాజాగా యూపీలో భోలేబాబా వంటి వ్యక్తులు ఉండడం అతడి పాద ధూళి కోసం తొక్కిసలాట జరిగి చనిపోవడం గమనార్హం.

ఇది భక్తి కాదు.. మూఢత్వం..

సృష్టికి మూలం అని దేవుడిని ఆరాధించడంలో తప్పు లేదు. కానీ, భోలే బాబా ఎవరు..? అతడు చేతితో నీరిస్తే సమస్యలు తీరడం ఏమిటి? అతడు అడుగుపెట్టిన చోట మట్టిని తాకితే ఆశీర్వాదం కావడం ఏమిటి? దీనిని భక్తి అంటారా? భోలే బాబా పాద ధూళి కోసం ఎగబడి హాత్రస్ లో 120 మంది చనిపోవడంతో ఇప్పడు సంచలనం అవుతుంది కానీ.. ఇలాంటివారు దేశంలో కొన్ని వేలమంది ఉంటారనడంలో సందేహం లేదు. ఆధ్యాత్మికత బోధించడం వేరు.. తానే దైవ స్వరూపుడిని అని చెప్పుకోవడం వేరు.. అసలు భోలే బాబా అనేవాడు లైంగిక వేధింపుల కేసులో జైలుకెళ్లిన వ్యక్తి కావడం గమనార్హం.

Read more!

భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్.. ఆ తర్వాత నారాయణ్‌ సాకార్‌ హరి.. సాకార్‌ విశ్వహరి, ‘భోలే బాబా’గా మారాడు. ఎటా జిల్లా పటియాలి తహసీల్‌ బహదూర్‌ గ్రామానికి చెందిన భోలే బాబా బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేశాడు. ఆ రాష్ట్ర పోలీసు శాఖలో 18 ఏళ్లు పనిచేశాడు. ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో విధులు నిర్వహించాననే భోలే బాబా.. వీఆర్‌ఎస్‌ తీసుకుని ఆధ్యాత్మిక బాట పట్టాడు. పోలీసు ఉద్యోగం నుంచి వచ్చాక అతడుమహిళలపై లైంగిక వేధింపుల కేసులో 1997లో అరెస్టయి జైలు శిక్ష కూడా అనుభవించాడు. తర్వాత బయటకు వచ్చి తన పేరును ‘సాకార్‌ విశ్వ హరి బాబా’గా మార్చుకున్నాడు. ఇలాంటివాడి పాద ధూళి కోసం, అతడిచ్చే నీళ్ల కోసం వెళ్లి వందల మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

Tags:    

Similar News

eac