వైరల్ ఇష్యూ... ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీరేనంట!!

ఇదే సమయంలో.. సినిమా హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారనే చర్చ వైరల్ గా మారింది

Update: 2024-04-01 05:22 GMT

ప్రస్తుతం తెలంగాణలో.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రకరకాల ప్రకంపనలు తెరపైకి వస్తున్నాయి. పక్క పార్టీవారివే కాకుండా... సొంత పార్టీలోని తురుపుముక్కల ఫోన్లను సైతం ట్యాప్ చేశారనే కథనాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో.. సినిమా హీరోయిన్స్ ఫోన్స్ కూడా ట్యాప్ చేశారనే చర్చ వైరల్ గా మారింది. ఈ సమయంలో మరో కీలక విషయం తెరపైకి వచ్చింది!

అవును... ప్రస్తుతం వస్తోన్న మీడియా కథనాల ప్రకారం.. తెలంగాణలో వైరల్ ఇష్యూగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. బీఆరెస్స్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారంట. ప్రస్తుతం ఈ విషయం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ ఇద్దరు మంత్రులు, మిగిలిన ఆ ఆరుగురు నేతలు ఎవరనేది ఇప్పుడు అత్యంత అసక్తికరంగా మారింది.

వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృంధం (సిట్)... పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా ఈ వ్యవహారంలో పాల్గొన్న రాజకీయ నాయకులను గుర్తించారని.. త్వరలో వారికి నోటీసులు అందించడానికి సిట్ అధికారులు సిద్దమవుతున్నారని అంటున్నారు.

మరోపక్క.. ఈ అంశంలో ప్రధానంగా వినిపిస్తున్న వారిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు పేరు ఒకటనేది తెలిసిన విషయమే. ప్రస్తుతం యూఎస్ లో ఉన్నట్లు చెబుతున్న ఈయన... ఏప్రిల్ 2 నాటికి భారత్ కు తిరిగి వస్తారని కథనాలు వస్తున్నాయి! దీంతో... అతనికి నోటీసులు అందించి, స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారని అంటున్నారు!

తాజాగా సిట్ అధికారులు జరిపిన విచారణలో... సీనియర్ పోలీస్ అధికారులు భుజంగ రావు, తిరుపతన్న లు ప్రభాకర్ ఆదేశాల మేరకు నడుచుకున్నారని... రిటైర్డ్ డీఎస్పీ రాధా కిషన్ రావు, సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావులతో కలిసి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు వివిద ప్రదేశాల్లో 11 వార్ రూం లను ఏర్పాటు చేసి, ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని కథనాలొస్తున్నాయి!

దీంతో ఈ విషయం రోజు రోజుకీ వైరల్ గా మారుతుంది. పైగా... తాజాగా.. బీఆరెస్స్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీల పాత్ర కూడా ఉందంటూ మీడియాలో వస్తోన్న కథనాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. మరి ఈ వ్యవహారం ఎలా కొలిక్కి రాబోతుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News