వసంత వర్సెస్ కొడాలి.. దుమ్మురేపుతున్న జిల్లా!
అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజీ కూడా భారీగా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని కొన్ని జిల్లాలకు చాలా వరకు ప్రత్యేకత ఉంది. అక్కడి హాట్ సీట్లలో కీలక నేతలు పోటీలో ఉండడం.. ఆయా జిల్లాల్లో ఓటు బ్యాంకు పెరగడం వంటి రీజన్లు ఉన్నాయి. అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజీ కూడా భారీగా పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో సుమారు42 నియోజకవర్గాలు హాట్ టాపిక్‌గా మారాయని చెప్పక తప్పదు. ఇలాంటి వాటిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండుకీలక నియోజకవర్గాలు దుమ్ము రేపుతున్నాయి.
అసలు ఈ రెండు నియోజకవర్గాలు లేకపోతే.. ఆ జిల్లాలో రాజకీయాలు పెద్ద ఊపు తెచ్చేవి కూడా లేవని అంటున్నారు పరిశీలకులు.అవే.. ఒకటి గుడివాడ. రెండు మైలవరం. ఈ రెండూ కూడా.. గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకున్న నియోజకవర్గాలే. అయితే.. ఈ సారి ఈరెండూ హాట్ టాపిక్ కావడానికి.. కారణం.. ఇక్కడ మారిన సమీకరణలు. అదేవిధంగా నాయకులు, పార్టీల ఎత్తుగడలు కూడా. ఇదే ఇక్కడ రాజకీయాలను వేడెక్కించింది.
గుడివాడలో ఈ సారి ఎన్నారై వెనిగండ్ల రాము టీడీపీ కూటమి తరఫున బరిలో ఉన్నారు. ఇక, వైసీపీ నుంచి మాజీ మంత్రి.. సిట్టింగ్ నేత కొడాలి నాని ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా తీవ్రస్థాయిలో పోరు సాగింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇక్కడ ఓటింగ్ శాతం కూడా.. ఇద్దరి మధ్య బిగ్ ఫైట్‌ను కళ్లకు కట్టింది. 82.51 శాతం ఈ సారి పోలింగ్ నమోదైంది. ఇది ఏకపక్షం అనివైసీపీ అంటున్నా.. కాదు... తమకు అనుకూలమని.. కూటమి పార్టీ చెబుతోంది. ఎలా చూసుకున్నా.. ఈ రెండు పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంది.
ఇక, మైలవరం విషయానికి వస్తే.. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున వసంత కృష్ణప్రసాద్ బరిలో ఉండగా.. ఆయన సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఈ సారి వైసీపీ నుంచి బీసీ నాయకుడు.. సన్యాల తిరుపతి యాదవ్‌ను బరిలో పెట్టారు. ఇక, ఇక్కడ డబ్బు ప్రభావం, ప్రవాహం కూడా.. సాగినా.. ప్రజలు వైసీపీవైపే ఉంటారని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. ఇక్కడ కూడా.. 85.32 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో గెలుపు ఎవరిదనే చర్చ జోరుగా సాగుతోంది. మొత్తంగా చూస్తే.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. కేవలం ఈ రెండు నియోజకవర్గాలపైనే ఎక్కువగా చర్చ సాగుతుండడం గమనార్హం.