వీడెంత బ్యాడ్ పోలీసంటే.. ‘5’ వేల అమ్మాయిల న్యూడ్ ఫోటోల్ని సేకరించాడట
2021లో పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో జాయిన్ అయిన ఇతడు.. స్నాప్ చాట్ లో టీనేజ్ కుర్రాడి మాదిరి వ్యవహరిస్తూ మైనర్ అమ్మాయిలకు గాలం వేసేవాడు.
వీడో బ్యాడ్ పోలీస్. అది కూడా అలాంటి ఇలాంటి కాదు. ఇలాంటోడు పోలీసు డిపార్టుమెంట్లో ఉంటాడా? అన్న సందేహం కలిగేంత నీచుడు. ఇతగాడి పాపాలు పండి జైలుపాలు కావటమే కాదు.. తాజాగా అతడికి కోర్టు 12 ఏళ్లు జైలు విధిస్తూ తీర్పును ఇచ్చింది. వీడు చేసిన దుర్మార్గాలు.. పాల్పడిన పాపాలు.. వేధింపులకు అది కూడా తక్కువే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన పోలీసు ఉద్యోగంలో ఉంటూ.. ఒక సైకో మాదిరి వ్యవహరించిన ఇతడి ఉదంతం గురించి తెలిస్తే గగుర్పాటుకు గురి కావాల్సిందే.
బ్రిటన్ కు చెందిన 24 ఏళ్ల లుయిస్ ఎడ్వర్డ్ అనే బ్రిటిష్ మాజీ పోలీసుకు తాజాగా అక్కడి న్యాయస్థానం పన్నెండేళ్ల జైలుశిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది.ఇతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో షాకింగ్ నిజాల్ని గుర్తించారు. వేలాది మంది అమ్మాయిల్ని వేధింపులకు గురి చేయటం.. దాదాపు 200లకు పైగా మైనర్ బాలికలను చెరబట్టి లైంగిక వేధింపులకు గురి చేసిన ఈ కామాంధుడి వ్యవహారం షాకింగ్ గా మారింది.
2021లో పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో జాయిన్ అయిన ఇతడు.. స్నాప్ చాట్ లో టీనేజ్ కుర్రాడి మాదిరి వ్యవహరిస్తూ మైనర్ అమ్మాయిలకు గాలం వేసేవాడు.వారికి అనుమానం రాకుండా వారి నగ్న చిత్రాల్నిసేకరించేవాడు. టీనేజ్ కుర్రాడిలా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకునే అతడు.. వీడియోకాల్ పేరుతో ప్రత్యేక యాప్ ల సాయంతో వారి ఫోటోల్ని తీసి.. వారిని వేధింపులకు గురి చేసేవాడు. ఇతగాడి పాపం ఎట్టకేలకు పండింది.
2022లో డార్క్ వెబ్ నుంచి అసభ్యకర చిత్రాల్ని డౌన్ లోడ్ విషయంపై బ్రిడ్జెంట్ ప్రాంతానికి చెందిన పోలీసులు శోధించటం షురూచేశారు. ఈ నేపథ్యంలో ఎడ్వర్డ్ పాపాల చిట్టా బహిర్గతమైంది. దీంతో.. ఇతగాడి దురాగతాల గురించి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేసి అతడిపై విచారణను మరింత లోతుగా చేపట్టారు. ఈ క్రమంలో అతడి ఫోన్ లో 207 మంది మైనర్ బాలికల నగ్న చిత్రాలతో పాటు.. 4500 మంది అమ్మాయిల అసభ్యకర చిత్రాలు.. 210 మంది యువతుల చిత్రాల్ని గుర్తించారు. అంతేకాదు.. మైనర్ బాలికలను బ్లాక్ మొయిల్ .. బెదిరింపులకు దిగినట్లుగా గుర్తించారు. దీంతో.. అతడి కేసును విచారించిన కోర్టు తాజాగా అతనికి 12 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ తీరపును ఇచ్చారు. కనీస కనికరం లేకుండా తనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడేవాడన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతం ఆ దేశంలో సంచలనంగా మారింది.