ఈ సంవత్సరం వడగాలులు ఉండవా?

వేసవి కాలంలో వేడి గాలులు వీయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Update: 2024-05-11 09:23 GMT

వేసవి కాలంలో వేడి గాలులు వీయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఈ సారి ఆ ప్రమాదం ఉండదని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో వడగాలుల తీవ్రత ఉండకపోవడంతో మామూలు వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. ఇన్నాళ్లు వేడి గాలులతో సతమతమైన ప్రజలకు ఇది నిజంగా తీపి కబురే. వడగాలుల తీవ్రత ఉండదని చెప్పడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

పశ్చిమ రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో మినహా మరే రాష్ట్రంలో వేడిగాలుల ప్రభావం ఉండదంటున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల జలాలు చల్లబడటం వల్ల అటు నుంచి వస్తున్న వడగాలుల తీవ్రత తగ్గుతోందని తెలుస్తోంది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తానికి వాతావరణం చల్లబడటం మంచిదే అంటున్నారు.

ప్రపంచంలో హిమనీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. కరువు కాటకాలు అందుకే సంభవిస్తున్నాయి. అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపం ఏటికేడు పెరుగుతోంది. భూమి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే పెను ప్రమాదమే.

ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేసే నష్టాలతోనే పర్యావరణం దెబ్బతింటోంది. ఫలితంగానే సరైన సమయంలో పడాల్సిన పడకుండా పోతున్నాయి. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్ అంధకారమే అంటున్నారు. అయినా ఎవరు లెక్క చేయడం లేదు. చూద్దాంలే అనే ధోరణితోనే అందరు ఉండటం గమనార్హం.

ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అంతేకాని విచ్చలవిడిగా చెట్లు నరకడంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఫలితంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని గుర్తించడం లేదు. ముందున్న ముప్పును గుర్తించకపోతే మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని తెలుసుకోవడం మంచిది.

Tags:    

Similar News