మంత్రుల‌ను ఓడించి మంత్రులైన మ‌గువ‌లు!

అంతేకాదు.. ఈ ముగ్గురు మ‌హిళా నూత‌న మంత్రులు కూడా వైసీపీకి చెందిన మంత్రుల‌ను ఓడించి.. మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఇది మ‌రో రికార్డు.

Update: 2024-06-12 16:18 GMT

టీడీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేబినెట్‌లో ముగ్గురు మ‌హిళా నాయ‌కులు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ముగ్గురూ కూడా.. ఒక్కొక్క‌రు ఒక్కొక్క సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఒక‌రు ఎస్సీ, మ‌రొక‌రు ఎస్టీ, ఇంకోక‌రు బీసీ కావ‌డం విశేషం. అంతేకాదు.. ఈ ముగ్గురు మ‌హిళా నూత‌న మంత్రులు కూడా వైసీపీకి చెందిన మంత్రుల‌ను ఓడించి.. మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఇది మ‌రో రికార్డు.

1. అనిత వంగలపూడి. పాయకరావుపేట ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. 2012లో ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దృష్టిలో ప‌డ్డారు. దీంతో 2014లో పాయకరావుపేట టికెట్ ఇచ్చారు. అప్ప‌ట్లో ఆమె విజ‌యం ద‌క్కించుకున్నారు. 2019లో నియోజ‌క‌వ‌ర్గం మార్చ‌డంతో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. 2024లో పాయకరావుపేట నుంచి గెలిచారు. వైసీపీ నేత కంబాల జోగులును ఓడించి.. మంత్రి పీఠం ద‌క్కించుకున్నారు.

2. గుమ్మడి సంధ్యారాణి. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని సాలూరు ST నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించు కున్నారు. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కురాలైన ఆమె.. ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మంత్రి అయ్యారు. వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరపై 13వేల ఓట్ల మెజారిటీతో సంధ్యారాణి విజ‌యం ద‌క్కించుకున్నారు.

3.ఎస్.సవిత. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన BC కురుబ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. తొలిసారి ఆమె పోటీ చేసినా విజ‌యం అందుకున్నారు. పెనుకొండలో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్‌ను ఓడించారు. ఇలా ముగ్గురు మ‌హిళా మంత్రుల‌కు ప్ర‌త్యేకత ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News