తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాదం... అసలేమైంది?
తిరుపతిలో ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
తిరుపతిలో ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన ఇంకా మరువక ముందే మరో కీలక ఘటన జరిగింది. దీంతో... తిరుమలలో ఏమి జరుగుతుంది? అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
అవును... తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుమల లడ్డూ కౌంటర్ లో సోమవారం స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ మేరకు 47వ లడ్డూ కౌంటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. ఇలా లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసే కౌంటర్స్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడ్దంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో... 47వ లడ్డూ కౌంటర్ లో ఉన్న కంప్యూటర్ కు సంబంధించిన అన్ ఇంటరప్టెడ్ పవర్ సప్లై (యూపీఎస్) లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఇలా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ కౌంటర్ పొగతో నిండుకుంది. దీంతో.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. మంటలు ఆర్పివేశారు. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పిందని చెబుతున్నారు.
మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం!:
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసింది. నాగ వాసుకి ఆలయ సమీపంలోని సెక్టార్-6 వద్ద ఈ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా.. టీటీడీ ఈ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కుంభమేళాకు వచ్చె భక్తులు శ్రీవారి ఆలయాన్ని సందర్శించేలా ఏర్పాట్లు చేశారు.