'శ్రీవాణి ట్రస్టు రద్దు.. పొలిటికల్ స్పీచ్ లు నిషేదం'.. టీటీడీ పలు కీలక నిర్ణయాలు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తాజాగా జరిగింది.

Update: 2024-11-18 11:55 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం తాజాగా జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి.. ఆ స్కీమ్ ను మాత్రం కొనసాగించేలా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును.. టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... శ్రీవాణి ట్రస్టును రద్దు చేసి, ఆ పథకాన్ని మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా స్పందించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు... శ్రీవారి భక్తులకు రెండు మూడు గంటల సమయంలోనే దర్శనం కల్పిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా... ప్రైవేటు బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను తిరిగి ప్రభుత్వ బ్యాంకుల్లోకి మళ్లిస్తామని తెలిపారు. ఇదే సమయంలో కొండపై ఉన్న అన్యమతస్థులైన ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగిస్తామని.. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ కి వరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

ఇదే సమయంలో... తిరుమల డంపింగ్ యార్డ్ లోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామని వెల్లడించారు. ఇదే క్రమంలో... శరదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని.. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నామని.. పర్యాటకం ద్వారా దర్శనం టిక్కెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నామని తెలిపారు.

ఇదే క్రమంలో... తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదని.. ఇదే సమయంలో.. తిరుమలలో రాజకీయ ప్రకటనలు చేయడం పూర్తిగా నిషేధిస్తామని, వాటిని ఎవరైనా అతిక్రమిస్తే కేసులు పెడతామని బీఆర్ నాయుడు తెలిపారు. ఇదే సమయంలో... తిరుపతి ప్రజలకు ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇదే క్రమంలో... అన్నప్రసాదంలో భక్తులకు అందించే మెనూలో అదనంగా కొన్ని పదార్థాలు చేరుస్తామని.. లడ్డూ ప్రసాదంలో వినియోగించే పదార్థాల నాణ్యత పెంపుకి నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవం బహుమానంగా ఉద్యోగులకు రూ.15,400 అందిస్తామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు!

Tags:    

Similar News