తప్పటడుగులు వేస్తే: ఆమెకు 30.. అతడికి22.. కట్ చేస్తే విషాదం
విశాఖ జిల్లా పద్మనాభం మండలం పరిధిలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటనలు ఎన్నో కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఒక్క తప్పటడుగు ఎందరినో ప్రభావితం చేస్తుంది. అంతులేని విషాదానికి గురి చేస్తుంది. తప్పు వారు చేసి.. శిక్ష మాత్రం కుటుంబాలకు వేసే ఈ తీరు.. ఇటీవల కాలంలో ఎక్కువ అవుతోంది. ఇప్పుడు చెప్పే ఉదంతం గురించి చదివిన తర్వాత.. చేతులారా నాశనం చేసుకోవటం అంటే.. ఏమిటో అర్థమవుతుంది. అనైతిక బంధాలతో అనూహ్య సమస్యలు మాత్రమే కాదు.. కోలుకోలేని విషాదాలకు కారణమవుతుంటాయి. అందుకే.. అలాంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం అందరి మీదా ఉంది. ఇలాంటి ఉదంతాల్ని పాఠాలుగా మార్చుకొని.. ఇలాంటి తప్పులకు ఫలితం ఏమిటన్న దానిపై అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.
విశాఖ జిల్లా పద్మనాభం మండలం పరిధిలోని ఒక గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటనలు ఎన్నో కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆమెకు 30 ఏళ్లు. పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. అన్యోన్య దాంపత్యం. చక్కగా సాగిపోతున్న ఆమె జీవితం.. ఆమె వేసిన ఒక్క తప్పటడుగు ఆమె ప్రాణాలు పోయేలా చేయటమే కాదు.. ఆ కుటుంబానికి అంతులేని శోకాన్ని..ఎప్పటికి వదలని మానసిక వేదన బారిన పడేసింది. 22 ఏళ్ల యువకుడితో ఆమె సాగించిన అనైతిక బంధం బయటకు పొక్కటంతో.. ఆత్మహత్య చేసుకుంది. ఆ కుర్రాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు వీరిద్దరి తప్పుడు పనులతో ఈ రెండు కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడిన పరిస్థితి.
పద్మనాభం మండలం క్రిష్ణాపురానికి చెందిన 30 ఏళ్ల లక్ష్మీ.. అదే ఊరికి చెందిన 22 ఏళ్ల ఆదిత్య వేర్వేరు చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేయగా. షాకింగ్ వాస్తవాలు వెలుగు చూశాయి. వీరిద్దరి పరిచయం ఆ తర్వాత వేరే మార్గంలోకి వెళ్లటం..వీరిద్దరి సంబంధం బయటకు రావటం.. కలిసి ఉండటం సాధ్యం కాదన్న విషయంపై క్లారిటీ వచ్చినంతనే.. వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్న లక్ష్మీని చూసి.. ఆ వెంటనే ఆదిత్య కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరి ఆత్మహత్యల కారణంగా.. లక్ష్మి ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాధలయ్యారు. మరోవైపు ఆదిత్య ఆత్మహత్య తో చేతికి వచ్చిన కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన వైనం ఆ పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులకు తీర్చలేని వేదనను మిగిల్చింది. వీరిద్దరి మధ్య జరిగిన రికార్డింగులు.. చాటింగ్ లు వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుందని చెబుతున్నారు. ఒకే ఊరు కావటంతో.. గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెట్ ఏరపాటు చేయటం గమనార్హం.