బన్నీ - త్రివిక్రమ్.. మొదలయ్యేది ఎప్పుడంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. వీరిద్దరి నుంచి చివరిగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పుష్ప తర్వాత బన్నీ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఆ మూవీ నిలిచింది. ఆ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ ‘పుష్ప 2’తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ చిత్రంతో 1000 కోట్ల క్లబ్ లో చేరాలని బన్నీ అనుకుంటున్నారు. మేకర్స్ కూడా టార్గెట్ గట్టిగానే పెట్టారు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని అల్లు అర్జున్ క్రియేట్ చేసుకుంటాడని అందరూ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బన్నీ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేస్తున్నారు. క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
మైథలాజికల్ కాన్సెప్ట్ బేస్డ్ గా పీరియాడిక్ జోనర్ లోనే ఈ సినిమా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. మూవీ ప్రీప్రొడక్షన్ వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి 2025 జూన్ లేదా జులై నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారంట. ‘పుష్ప’ రిలీజ్ తర్వాత త్రివిక్రమ్, బన్నీ సినిమా ప్రారంభోత్సవం ఉండొచ్చని అనుకుంటున్నారు. అల్లు అర్జున్ కెరియర్ లో ఫస్ట్ మైథలాజికల్ కాన్సెప్ట్ మూవీగా ఈ సినిమా ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. దీని తర్వాత గ్యాప్ తీసుకొని బన్నీ కోసం స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పని మొదలెట్టారు. ఇప్పటికే నిర్మాత నాగ వంశీ ఈ సినిమాపై ఆసక్తికర విషయాలు చెప్పి మూవీపై అంచనాలు పెంచేశారు.