ముదురుతున్న ట్రూడో వ్యవహరం... భారత్ పై మరో కవ్వింపు చర్య!
ఈ నేపథ్యంలో... జస్టిన్ ట్రూడో సర్కార్ మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. భారత్ పై మరో బురద జల్లె పనికి పూనుకుంది.
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన బంధం పతనానికి చేరుకుందనే చర్చ ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ విషయంలో అనుసరిస్తున్న వ్యవహార శైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో మరో కవ్వింపు చర్యకు ప్రయత్నిస్తోంది కెనడా ప్రభుత్వం.
అవును... ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ - కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... జస్టిన్ ట్రూడో సర్కార్ మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. భారత్ పై మరో బురద జల్లె పనికి పూనుకుంది. ఇందులో భాగంగా సైబర్ గూఢచర్యానికి పాల్పడే దేశాల జాబితాలో భారత్ ను చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ మేరకు.. తమకు ముప్పుగా భావించే దేశాల నివేదికలో భారత్ పేరును ప్రస్తావించింది కెనడా. ఇదే సమయంలో... చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, రష్యాతో భారత్ ను పోలిస్తూ తీవ్ర ఆరోపణలూ చేసింది. తాజాగా కెనడియన్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ 2025-26 ఏడాదికి సంబంధించి విడుదల చేసిన "జాతీయ సైబర్ ముప్పు" నివేదికలో ఈ విషయాలను ప్రస్థావించింది.
ఇందులో భాగంగా... అంతర్జాతీయ వేదికపై అధికార శక్తిగా మారాలని ఆకాంక్షిస్తున్న భారత్ వంటి దేశాలు.. తమకు వ్యతిరేకంగా వివిధ స్థాయుల్లో సైబర్ ప్రోగ్రామ్ లను రూపొందిస్తున్నాయని కెనడా తెలిపింది. ఇదే క్రమంలో... తమ దేశం ఎదుర్కోంటున్న సైబర్ ముప్పులు, ప్రాంతీయ ప్రత్యర్థుల నుంచి జరిగే హ్యాకింగ్స్ పై దృష్టిపెడుతుందని కెనడా తన నివేదికలో ఆరోపించింది.
కాగా... ఖలీస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది కెనడా.