తెరపైకి 'ఫ్రెంచ్ చక్రవర్తి' ప్రస్థావన... ట్రంప్ నిజమైన నియంతా..?

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.

Update: 2025-02-16 11:30 GMT

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జన్మతః పౌరసత్వం రద్దు నుంచి మొదలు ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటూ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇప్పుడు వ్యాజ్యాలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో ఆయన పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

అవును... అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నిత్యం పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. వీటిలో ప్రధానంగా బర్త్ రైట్ సిటిజన్ షిప్ తో పాటు యూఎస్ ఆర్మీలో పనిచేయకుండా నిషేధం విధించడం, ప్రభుత్వ నియామకాలపై బ్యాన్, క్యాపిటల్ హిల్ పై దాడిచేసిన వారికి క్షమాభిక్ష పెట్టడం, డోజ్ కు కీలక బాధ్యతలు అప్పగించడం ఇందులో ప్రధానం.

ఈ నేపథ్యంలో... ఆయన పలు వ్యాఖ్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలపై కోర్టులు స్టేలు విధించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా ట్రూత్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఓ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టులో ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ వ్యాఖ్యలను ప్రస్థావించారు. ఇందులో భాగంగా... "తన దేశాన్ని రక్షించేవాడు ఎటువంటి చర్యలు తీసుకున్నా.. అది చట్టాల్ని ఉల్లంఘించినట్లు కాదు" అనే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో... నెపోలియన్ ను ప్రస్థావిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన తన చర్యలను సమర్థించుకున్నట్లు స్పష్టమవుతోంది.

వాస్తవానికి ఫ్రాన్స్ ను పరిపాలిస్తున్న సమయంలో.. తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ నెపోలియన్ తరచూ ఈ వ్యాఖ్యలను చేసేవారంట. ఈ నేపథ్యంలోనే స్పందించిన కాలిఫోర్నియా సెనేటర్ ఆడమ్ షిఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... అమెరికా అధ్యక్షుడు నిజమైన నియంతలా మాట్లాడారు అని రాసుకొచ్చారు.

ఇలా ట్రంప్ తాను తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించుకోవడానికి అన్నట్లు చేస్తోన్న వ్యాఖ్యల నేపథ్యంలో నెపోలియన్ వ్యాఖ్యలను ఉటంకించడంతో.. ప్రెసిడెంట్ కు ఆ ఫ్రెంచ్ చక్రవర్తే ఆదర్శమా అనే చర్చకు డెమోక్రాట్లు తెరలేపారని అంటున్నారు.

Tags:    

Similar News