విమాన ప్రమాదంపై ట్రంప్ తీవ్ర అసహనం.. సీరియస్ వ్యాఖ్యలు!

అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ పరస్పరం ఢీకొని ఆ రెండు నదిలో కూలిపోయిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-30 08:59 GMT

అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, హెలికాప్టర్ పరస్పరం ఢీకొని ఆ రెండు నదిలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

అవును... అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ సమీపంలో 64 మందితో వెళ్తున్న విమానం, హెలీకాప్టర్ ఒకదానినొకటి ధీకొని ఇవి రెండూ పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఆ సమయంలో... విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 గురు సిబ్బంది ఉండగా.. హెలీకాప్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా... విమానాశ్రయానికి వెళ్లే దారిలో విమానం సరైన దిశలో ఉందని.. హెలీకాప్టర్ చాలాసేపు నేరుగా విమానం వైపు వెళ్లిందని.. ఆకాశం చాలా నిర్మలంగానే ఉందని.. విమానం లైట్లన్నీ వెలుగుతున్నాయని అన్నారు.

అయితే... ఆ విమానం కిందకో, మీదకో, పక్కకో హెలీకాప్టర్ ఎందుకు వెళ్లలేదు అని ట్రంప్ ప్రశ్నించారు. విమానాన్ని చూశారా అని అడిగే బదులు.. ఏమి చేయాలో కంట్రోల్ రూమ్ లోని సిబ్బంది ఎందుకు చెప్పలేదు అని అడిగారు. ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదమని.. ఇలా జరగడం ఏమాత్రం సరిగా లేదని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కాగా.. విమానం ల్యాండింగ్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చిన సమయానికి ఓ మిలటరీ హెలికాప్టర్ సరిగ్గా అదే మార్గంలోకి వచ్చింది. దీంతో.. అలర్ట్ అయిన ఏటీసీ.. "మీ ముందు విమానం వస్తోంది కనిపిస్తుందా?" అని హెలికాప్టర్ పైలెట్ కు సమాచారం ఇచ్చారు. అనంతరం 30 సెకన్లలోపే ఆ రెండూ ఢీకొన్నట్లు పెద్ద శబ్ధం వినిపించిందని చెబుతున్నారు.

ఈ విషయాన్నే ప్రస్థావించిన ట్రంప్.. విమానాన్ని చూశారా అని అడిగే బదులు.. ఏమి చేయాలో కంట్రోల్ రూమ్ లోని సిబ్బంది ఎందుకు చెప్పలేదు అని అడిగారు.

Tags:    

Similar News