గుడ్ న్యూస్... హెచ్-1బీ వీసాలపై మస్క్ మాటే ట్రంప్ మాట!

అవును... హెచ్-1బీ వీసాల విస్తరణపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్న వేళ.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి

Update: 2024-12-29 07:02 GMT

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. వచ్చే ఏడాది జనవరి 20న అగ్రరాజ్యం అధినేతగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో ప్రధానంగా హెచ్-1బీ వీసాలపై తీవ్ర చర్చమొదలైంది. ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

ప్రధానంగా సుంకాల విధింపు విషయంలో పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. హెచ్-1బీ వీసాల విషయంలో మరికొన్ని దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు. పైగా డొనాల్డ్ ట్రంప్ పార్టీలో హెచ్-1బీ వీసాల విస్తరణపై భిన్నాభిప్రాయాలు వక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ స్పందించారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... హెచ్-1బీ వీసాల విస్తరణపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్న వేళ.. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఈ చట్టబద్ధమైన వలసలకు మద్దతు ఇస్తున్న వేళ.. అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఈ వీసా ప్రోగ్రాంకు తాను మద్దతిస్తానని తెలిపారు.

ఇందులో భాగంగా... నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రామ్ కు తాను మద్దతిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే సమయంలో... తాను ఎల్లప్పుడూ హెచ్-1బీ వీసాలకు అనుకూలంగా ఉంటానని.. అందుకే తమ దేశంలో ఈ వీసాలు ఉన్నాయని అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి ఈ విషయంపై మాట్లాడారు. ఇందులో భాగంగా... అమెరికా తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్నందున.. ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గలవారిని దేశంలోకి అనుమతించడానికి హెచ్-1బీ వీసా ఉపయోగపడుతుందని తెలిపారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డీఓజీఈ) సంయుక్త సారథులుగా నియమితులైన ఇద్దరూ... టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలని.. ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటిస్థానంలో ఉండాలంటే ఈ వీసా ప్రోగ్రాం కు మద్దతూ ఇవ్వాలని కోరడం గమనార్హం. మస్క్ కూడా హెచ్-1బీ వీసా ద్వారానే యూఎస్ కి వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా... ఈ వ్యవహారంపై స్పందించిన రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ.. తాను సౌత్ కరోలినా గవర్నర్ గా పనిచేసిన సమయంలో 11 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు 4 శాతానికి పడిపోయిందని.. దీనికి కారణం.. విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించడం అన్ని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే... ప్రత్యేక నిపుణులైన విదేశీయులను మరింత తేలిగ్గా నియమించుకొనేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ బైడెన్ కార్యవర్గం పలు నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతో పాటు.. ఎఫ్-1 విద్యార్థి వీసాలను సులువుగా హెచ్-1బీ వీసాలుగా మారుకొనే అవకాశం కల్పించింది. ఇది లక్షలాది మంది ఇండియన్ ప్రొఫెషనల్ ఎక్స్ పర్ట్స్ కి ప్రయోజనం కల్పించనుంది.

ఈ నేపథ్యంలో తాజాగా హెచ్-1బీ వీసాలకు నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు అమెరికాకు రావడానికి ఉపయోగపడే ప్రత్యేక వీసా ప్రోగ్రామ్ కు తాను మద్దతిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రధానంగా భారతీయులకు గుడ్ న్యూస్ అని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News