ప్రతీ చర్యకూ ప్రతిచర్య మస్ట్.. భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
వచ్చే నెలలో అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల ప్రస్థావన తెరపైకి తెచ్చారు.
వచ్చే నెలలో అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల ప్రస్థావన తెరపైకి తెచ్చారు. 2019లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను "సుకాల రాజు / టారిఫ్ కింగ్" గా అభివర్ణించిన ఆయన... మరోసారి ఈ సుంకాల విషయంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ లో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. సుంకాల విషయంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్ తో పాటు బ్రెజిల్ ప్రస్థావనా తెచ్చారు. ఇందులో భాగంగా... అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని అన్నారు.
అమెరికా ఉత్పత్తులపై ఈ రెండు దేశాలూ 100 నుంచి 200 శాతం కూడా పన్నులు వేస్తున్నాయని చెప్పారు. ఈ సమయంలోనే... ప్రతీ చర్యకూ ప్రతిచర్య ఉంటుందని మొదలుపెట్టిన ట్రంప్... ఆయా దేశాలు తమ ఉత్పత్తులపై పన్నులు విధిస్తే.. తాము అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా... ఒకవేళ భారత్ తమ ఉత్పత్తులపై 100 శాతం పన్నులు విధిస్తే.. తాము కూడా అలాగే వారిపై చార్జ్ చేయకూడదా అని ట్రంప్ ప్రశ్నించారు. అయితే... ఎంతెంత సుంకాలు వసూలు చేయాలేదనేది వారి వారి ఇష్టమని.. కాకపోతే వారి స్పందనకు తగ్గట్లుగానే తమ ప్రతిస్పందన ఉంటుందని ట్రంప్ వివరించారు.
వాస్తవానికి అధ్యక్ష ఎన్నికలకు ముందు, ప్రచార సమయంలోనూ ట్రంప్ ఈ అంశంపై పలుమార్లు స్పందించారు. ఇందులో భాగంగా ఇదే తరహా వ్యాఖ్యలూ చేశారు. తాను అధికారంలోకి వస్తే భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాల ఉత్పత్తులపై ఆధిక సుంకాలు విధిస్తానని చెప్పారు.
కాగా... ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమలో భాగంగా డెట్రాయిట్ లో నిర్వహించిన సదస్సులో ప్రసంగించిన ట్రంప్... భారత్, చైనా దేశాల సుంకాల విషయాన్ని ప్రస్థావించారు. ఈ సందర్భంగా... హార్లే – డేవిడ్ సన్ దిగుమతి పన్నులను ఉదహరిస్తూ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. హార్లే – డేవిడ్ సన్ దిగుమతుల విషయంలో భారత్ నుంచి ఎదురవుతున్న సుంకాలు 150 శాతం ఎక్కువగా ఉన్నాయని.. తన ఉద్దేశ్యంలో చైనా కంటే చాలా రకాలుగా భారత్ ఎక్కువ వసూలూ చేస్తుందని.. కాకపోతే చిరునవ్వుతో చేస్తుందంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో తాజాగా చర్యకు ప్రతిచర్య అంటూ స్పందించారు.