ట్రంప్ ఎఫెక్ట్... భారత్ లో ఐటీ, ఫార్మా లెక్కలు మారుతున్నాయా?
ఈ సమయంలో.. భారత్ లో ఐటీ, ఫార్మా రంగాలకు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.
ఆదాయాన్ని పెంచడానికి, వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించడానికి సుంకాలు విధించడం ఓ మార్గమని.. ఫలితంగా పరస్పర పన్నుల విషయంలో వెనక్కి తగ్గబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. భారత్ లో ఐటీ, ఫార్మా రంగాలకు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని అంటున్నారు.
అవును... రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని చెబుతూ.. పలు కఠిన నిర్ణయాలు తీసుకుని.. వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే భారత్ పైనా భారీగా సుంకాలు, ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
ఈ సమయంలో... భారత ఐటీ, ఫార్మా రంగానికి ఇబ్బందులు తప్పవనే చర్చ తెరపైకి వచ్చింది. వాస్తవానికి భారత ఐటీ, ఫార్మా రంగాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్. ఇక్కడ ఎగుమతుల్లో సుమారు 18 శాతం వరకూ అమెరికాకే వెళ్తున్నాయి. గత నాలుగేళ్లలోనూ భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకునే సుంకాల చర్యలు వల్ల భారత్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతోన్న వేళ.. ప్రధానంగా ఫార్మా, ఐటీ రంగాలపైనా పెను ప్రభావం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 2024 ఆర్థిక సంవత్సరం నటికి సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో 54% వాటాతో భారత ఎగుమతులకు అమెరికా ఓ ప్రధానమైన మార్కెట్ గా ఉంది.
ఇదే సమయంలో... కంప్యూటర్ సేవలు అత్యధికంగా 27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక ఫార్మా విషయానికొస్తే... అమెరికా నుంచి వచ్చే ఫార్మా దిగుమత్లపై భారత్ 10 శాతం సుంకం విధిస్తుండగా.. భారత్ నుంచి వచ్చే ఫార్మా దిగుమతులపై అమెరికా ఎటువంటి సుంకం విధించదు! అయితే.. ఇప్పుడు ప్రతీకార సుంకాల్లో భాగంగా అటు నుంచి పడే అవకాశం ఉంది!
కాగా... భారత్ ఎగుమతులకు అమెరికా ఓ ప్రధాన గమ్యస్థానం అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మొత్తం ఎగుమతుల్లో దాని వాటి 2018 ఆర్థిక సంవత్సరంలో 15.8 శాతం అయితే.. 2020 ఆర్థిక సంవత్సరంలో 16.9శాతం పెరిగింది. ఇక 2024లో ఇది 17.7 శాతానికి చేరుకుందని చెబుతున్నారు.