అసలే ట్రంప్.. తగ్గదేలేదంటూ డ్రాగన్ మీద సెంచరీ దాటేసిన సుంకం

ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా చైనా సైతం అంతే ధీటుగా స్పందించి అమెరికాపై ప్రతీకార సుంకాన్ని విధించటం తెలిసిందే.;

Update: 2025-04-09 05:21 GMT
Trump Tariffs On China

ప్రపంచంలో ఏ దేశమైనా.. తాము చెప్పింది మాత్రమే వినాలన్న మైండ్ సెట్.. నా దేశం మాత్రమే బాగోవాలి.. మరే దేశం ఎలా పోయినా.. ఆఖరకు ప్రపంచం ఏమైపోయినా నాకేం ఫర్లేదన్న మైండ్ సెట్ ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తనకు తోచినట్లుగా ప్రతీకార సుంకాల్నివిధించే విషయంలో తగ్గేదేలే అంటున్నారు. తాను వేసిన సుంకాలకు నోరు మెదపకుండా.. రాజీ ధోరణిలో ఒప్పందాలు చేసుకునే భారత్ లాంటి దేశాల్ని పక్కన పెడితే.. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తానన్న రీతిలో చైనా లాంటి దేశాలు తిరిగి తాము సైతం సుంకాన్నివిధించిన వేళ.. ట్రంప్ రియాక్షన్ దారుణంగా ఉంటోంది.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు ట్రంప్. తాను వార్నింగ్ ఇచ్చినప్పటికి వెనక్కి తగ్గకుండా.. సై అంటే సై అన్న చైనాపై భారీగా ప్రతీకార సుంకాన్ని విధిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు,. దీంతో చైనా వస్తువులపై విధించిన ప్రతీకార సంకాలు 104 శాతానికి చేరుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా చైనా సైతం అంతే ధీటుగా స్పందించి అమెరికాపై ప్రతీకార సుంకాన్ని విధించటం తెలిసిందే.

అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం సుంకాన్ని విధించిన వైనంపై భగ్గుమన్న ట్రంప్.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చైనాకు అల్టిమేటం ఇచ్చారు. ట్రంప్ లాంటోళ్లను అస్సలు లెక్కే చేయని చైనా.. వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. దీంతో ఈ రోజు (ఏప్రిల్ 9) నుంచి చైనా నుంచి అమెరికాు ఎగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 50 శాతం ప్రతీకార సుంకాన్ని విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ట్రంప్ సర్కారు నిర్ణయంపై చైనా స్పందించలేదు. మొత్తంగా ఇప్పటివరకు చూడని భారీ వాణిజ్య యుద్ధం ప్రపంచం ముందుకు రానుంది.

Tags:    

Similar News