ట్రంప్ దెబ్బకు యాపిల్ షేర్లు దారణంగా పడ్డాయి ఎందుకు?

అమెరికా వెలిగిపోవాలన్న ఆశను.. ఆకాంక్షను వ్యక్తం చేసే ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్ననిర్ణయాలు ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.;

Update: 2025-04-04 05:01 GMT
ట్రంప్ దెబ్బకు యాపిల్ షేర్లు దారణంగా పడ్డాయి ఎందుకు?

అమెరికా వెలిగిపోవాలన్న ఆశను.. ఆకాంక్షను వ్యక్తం చేసే ట్రంప్ దూకుడుగా తీసుకుంటున్ననిర్ణయాలు ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షేర్ మార్కెట్ మీద ప్రభావాన్ని చూపుతుంది. తమ మీద భారీగా సుంకాలు వడ్డించే దేశాల జాబితాను పట్టుకొని మరీ.. వారిపై ప్రతీకార సుంకాలు వేసిన ట్రంప్ తీరుతో ఎలాంటి కష్టాలు ఎదురవుతాయన్న దానికి నిదర్శనంగా ప్రఖ్యాత యాపిల్ కంపెనీ ఒక చక్కటి ఉదాహరణగా చెప్పచ్చు. తాజాగా ఆ షేరు ధర ఐదేళ్ల కనిష్ఠానికి చేరుకోవటం గమనార్హం.

ఎందుకిలా జరిగింది? ఐఫోన్ స్టాక్ పడిపోవటానికి కారణమేంటి? ట్రంప్ ప్రతీకార సుంకం వేస్తే అదే దేశానికి చెందిన యాపిల్ సంస్థకు దిమ్మ తిరిగే షాక్ తగలటం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్లో ఐఫోన్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఐఫోన్ల తయారీ భారీ ఎత్తున జరిగేది చైనాలో.

ప్రతీకార సుంకాలతో హడలెత్తిస్తున్న ట్రంప్.. చైనా మీద భారీగా సుంకం విధించటం తెలిసిందే. ఇది కాస్తా యాపిల్ కంపెనీకి నేరుగా తగిలింది. దీనికి కారణం.. ఐఫోన్ల ఉత్పత్తి భారీగాచైనాలోనే జరుగుతుంది. తాజాగా విధించిన ప్రతీకార సంకాల కారణంగా సప్లయ్ చైన్ కు ఇబ్బందిగా మారుతుందన్న అంచనాలు ఆ స్టాక్ ను పడేలా చేశాయి. సప్లై చైన్ కు వచ్చే ఇబ్బందులపై ఉన్న సందేహాల కారణంగా యాపిల్ షేర్లు 9 శాతం పడిపోయి నష్టాల్లో ట్రేడ్ అవుతున్ానయి. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలో పతనం కావటం ఇదే తొలిసారి. దీంతో.. యాపిల్ కంపెనీ విలువ 250 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

యాపిల్ స్టాక్ తో పాటు.. పలు దిగ్గజ కంపెనీలకు షాక్ తగిలింది. అమెజాన్ షేరు 6 శాతం.. ఎన్విడియా 5 శాతం.. టెస్లా 4.5 శాతం.. గూగుల్ 3 శాతం.. మెటా 6 శాతం.. మైక్రోసాఫ్ట్ 2 శాతం చొప్పున నష్టపోయాయి. ట్రంప్ ప్రతీకార ప్రకటన డోజోన్స్ సూచీ 1118 పాయింట్లు క్షీణించింది. నిజానికి ఇది ఒక దశలో 1500 పాయింట్లవరకు వెళ్లింది. ఆ తర్వాత కాస్త సర్దుబాటు చేసుకోవటంతో నష్టం కాస్త తగ్గింది. నాస్ డాక్ 4 శాతం.. ఎస్ అండ్ పీ 3.5 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ మార్కెట్ లో చిన్న కంపెనీల షేర్లకు ప్రాతినిధ్యం వహించే రస్సెల్స్ 2000 ఇండెక్స్ 5 శాతం క్షీణించింది. స్టాక్ మార్కెట్ తాజా పతనంతో అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.65 ట్రిలియన్ డాలర్లు (మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.14,04,32,07,75,00,000) హరించుకుపోవటం గమనార్హం.

Tags:    

Similar News