బెట్టింగ్ యాప్ లో ట్రంప్ విజయావకాశాలు.. మార్పుకు ఇవేనా కారణాలు?

అయితే... తాజాగా వెలువడుతున్న ఒపీనియన్ పోల్స్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వైపు అమెరికన్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Update: 2024-10-22 04:48 GMT

అమెరికా అధ్యక్ష ఎన్న్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఉత్కంఠ మునివేళ్లపై నిలబెడుతుందని అంటున్నారు. డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ల విజయావకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయని.. ఇద్దరి మధ్య వ్యత్యసం చాలా స్వల్పంగా ఉందని అంటున్నారు. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్ లో ట్రంప్ విజయవకాశాలు మెరుగుపడటం గమనార్హం!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోరు హోరా హోరుగా ఉండనుందనేది ఇప్పటికే స్పష్టమైన పరిస్థితి. ఫలితాలు టై అయితే... అనే చర్చ కూడా తెరపైకి వచ్చిందంటే... వార్ ఎట్టిపరిస్థితుల్లోనూ వన్ సైడ్ కాదని స్పష్టమవుతూనే ఉంది. ఇందులో కమలా హారిస్ కు ఉండే బలం ఆమెకు ఉంటే.. ట్రంప్ ను కోరుకునేవారి కారణాలు వారికి ఉన్నాయి.

ఇందులో భాగంగా... వలస విధానం, విదేఏశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ హక్కులు, నేరాలు వంటివి ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉన్న వేళ.. ఆర్థిక వ్యవహారాల విషయంలో ట్రంప్ ను నమ్మలేమని.. మస్క్ వంటి వారికే పన్నులు తగ్గిస్తారు తప్ప, మధ్య తరగతికి ప్రయోజనం కలిస్తారని అనుకోవడం లేదని పలువురు అంటున్నారు.

ఈ మధ్య తరగతికి పన్నుల ఉపశమనం విషయంలో హరీస్ కే అమెరికన్లు కాస్త మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా... ఈ విషయంలో 46 శాతం మంది హారిస్ కే మొగ్గు చూపగా.. 35 శాతం మంది మాత్రమే ట్రంప్ ను సమర్ధిస్తున్నారు. ఇళ్ల ధరల విషయంలోనూ పరిస్థితి ఇలానే ఉందని చెబుతున్నారు.

ఇదే సమయంలో... దిగుమతులపై సుంకాల విషయంలో ట్రంప్ వైపే అమెరికన్లు మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు. ఇక.. నిత్యావసరాలు, పెట్రో ధరల విషయంలో మాత్రం ఇద్దరికి సమానంగానే మద్దతు లభిస్తోంది. ఈ ఎన్నికల్లో మరో కీలక అంశంగా ఉన్న అబార్షన్ హక్కుల అంశంలో హరీస్ కు భారీ మద్దతు లభిస్తోందని తెలుస్తోంది.

అయితే... తాజాగా వెలువడుతున్న ఒపీనియన్ పోల్స్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వైపు అమెరికన్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. తాజాగా మెక్ డొనాల్డ్ లో ట్రంప్ చేసిన హడావిడి ఆయనకు కలిసొచ్చిందని అంటున్నారు. ఈ వ్యవహారం అనంతరం డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలు మరింత పెరిగాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ప్రసిద్ధి చెందిన పాలీ మార్కెట్ బెట్టింగ్ యాప్ లో ట్రంప్ విజయావకాశాలు ట్రెండ్ 2.5 శాతం పెరిగిందని చెబుతున్నారు. మొత్తంగా... కమల హారిస్ తో పోలిస్తే విజయావకాశాలు 24 శాతం పెరిగాయని అంటున్నారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఇలానే ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News