ఆ పని చేసి ట్రంప్ ప్రాణాలు కాపాడుకున్నారు !

అదే టైం లో ట్రంప్ ని గురి పెట్టిన క్రూక్స్ ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Update: 2024-07-15 02:30 GMT

డొనాల్డ్ ట్రంప్ కి ఇక రానున్నవి మంచి రోజులేనా అంటే ఆయన ప్రాణాలను కాపాడుకుని బయటపడ్డ సంఘటన చూస్తే అదే నిజం అనిపిస్తుంది అంటున్నారు. ట్రంప్ ని షాట్ పెట్టి మరీ తుపాకీతో కాల్చడానికి థామస్ మాథ్యూ కూక్స్ అనే ఇరవై ఏళ్ళ యువకుడు చేసిన ప్రయత్నం విఫలం అయింది. దానికి కారణం సెకన్ లో వెయో వంతు అన్నట్లుగా ట్రంప్ తలను ఆ టైం లో అటు తిప్పడం. ట్రంప్ హెడ్ కి టార్గెట్ చేసి వెళ్ళిన ఆ బుల్లెట్ కాస్తా చెవి పక్కన రాసుకుని దూసుకుని పోయింది. దాంతో స్వల్ప గాయాలతో ట్రంప్ బయటపడ్డారు. అదే టైం లో ట్రంప్ ని గురి పెట్టిన క్రూక్స్ ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

ట్రంప్ ఆ సమయంలో తల తిప్పడం కనుక చేయకపోయి ఉంటే ఆయన తలలో నుంచే ఆ బుల్లెట్ దూసుకుని పోయేది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ దాదాపుగా ఎనభై కి దగ్గరలో ఉన్నారు. ఆయన చెవికి గాయమై తీవ్ర రక్తస్రావం అయినా ఆయన వెంటనే లేచి నిలబడడం ద్వారా తన డేరింగ్ నేచర్ ని చాటి చెప్పారని అంటున్నారు. అంతే కాదు తన మద్దతుదారులను ఆయన ఉద్దేశించి ఫైట్ అని నినాదాలు చేయడం ద్వారా తన స్పిరిట్ ని చూపించారు అని అంటున్నారు.

మరో వైపు ట్రంప్ తో పాటు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రసంగాలలో బైడెన్ కాస్తా వెనుకబడ్డారు అని అంచనాలు ఉన్నాయి. దీంతో ఇపుడు ట్రంప్ మీద జరిగిన ఈ దాడితో ఆయనకు ఎక్కడలేని సానుభూతి కూడా ఏర్పడింది అని అంటున్నారు. ఒక్కసారి ట్రంప్ విజయావకాశాలు డెబ్బై శాతం పైగా పెరిగాయని అంటున్నారు.

తన మీద జరిగిన హత్యాయత్నం టైం లో ట్రంప్ చూపించిన ధైర్య సాహసాలు కూడా చర్చకు వస్తున్నాయి. వీటితో పాటుగా తృటిలో తప్పించుకుని ప్రాణాలతో నిలిచిన ట్రంప్ కి ఇక రానున్న రోజులు అన్నీ గొప్పవే అంటున్నారు.

ట్రంప్ లక్కీ అని అంటున్నారు. ఆ లక్ ఆయన్ని నేరుగా తీసుకుని వెళ్ళి అమెరికాలోని శ్వేతసౌధంలో కూర్చోబెడుతుందని అంటున్నారు. ట్రంప్ కి ఇక తిరుగులేదని కూడా అంటున్నారు. మొత్తానికి క్రూక్స్ ట్రంప్ కి గురి పెట్టి ఆయన లక్ ని టెస్ట్ చేశారు అని అంటున్నారు.

ఏది ఏమైనా అమెరికాలో ఈ రకమైన రక్త చరిత్ర రాయడానికి చూడడం మంచిది కాదని అంటున్నారు. ప్రజాస్వామ్య విధానాలను నమ్మిన వారు ఎవరూ ఈ రకంగా హింసను విశ్వసించరు అని అంటున్నారు. ట్రంప్ ఇపుడు అమెరికన్ పీపుల్ కి హాట్ ఫేవరేట్ అయ్యారని ఈ ఘటనతో ఆయన సక్సెస్ కి మరింత చేరువ అయ్యారని అంటున్నారు. చూడాలి మరి అమెరికా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో.

Tags:    

Similar News