సముద్రంలో పెను భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ!

కరేబియన్ సముద్రంలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత అసాధారణంగా నమోదు కావడం వల్ల సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

Update: 2025-02-09 07:15 GMT

డిసెంబర్ 26 - 2004న హిందూ మహాసముద్రంలోని సుమత్రా, ఇండోనేషియా దేశాలకు దక్షిణ తీర కేంద్రంగా ఏర్పడిన సునామీ ఏ స్థాయిలో ప్రపంచాన్ని వణికించిందనే సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో 14 దేశల్లో సుమారు 2,30,000 మంది బలైపోయారు. దీంతో... సునామీ అనే పదం వినిపిస్తేనే సముద్ర తీర ప్రాంత వాసులు వణికిపోతారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సముద్రంలో భూకంపం సంభవించింది.

అవును... కరేబియన్ సముద్రంలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత అసాధారణంగా నమోదు కావడం వల్ల సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా భూకంప ప్రభావం ఆరు దేశాలపై పడిందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పటికే తీర ప్రాంతాలు పోటెత్తిన పరిస్థితి. మరోపక్క పలు చోట్ల సముద్రం ఇప్పటికే ముందుకువచ్చిందని చెబుతున్నారు. ముందుకొస్తున్న అలలు వణికిస్తున్నాయని చెబుతున్నారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా రికార్డైనట్లు చెబుతున్నారు. హోండరస్ కు ఉత్తరదిశగా సుమారు 32 కిలోమీటర్లు.. కేమన్ ఐలండ్స్ కు నైరుతి దిశగా సుమారు 209 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే వెల్లడించింది.

ఈ సమయంలో భూకంప తీవ్రత అసాధారణంగా ఉండటం వల్ల నేషనల్ వెదర్ సర్వీస్.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా.. ఫ్యుర్టోరికో, యూఎస్ విర్జిన్ ఐలాండ్స్ కు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే.. ఆ ప్రభావం కనిపించ్కపోవడంతో 45 నిమిషాల తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. అయినప్పటికీ తీరంలో అలల విషయంలో హెచ్చరికకు చేసింది.

Tags:    

Similar News