లారెన్స్ హిట్ లిస్ట్ లో మరో రెండు పేర్లు... మొదలైన బెదిరింపులు!
ఈ సమయంలో ఆ హిట్ లిస్ట్ లో మరో రెండు పేర్లు చేరినట్లు తెలుస్తోంది.
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధీఖీ హత్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వినిపించిన కాల్పుల మోతతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సమయంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆ హిట్ లిస్ట్ లో మరో రెండు పేర్లు చేరినట్లు తెలుస్తోంది.
అవును... బాబా సిద్ధికీ హత్యకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించిన నేపథ్యంలో.. ముంబై మహానగరం మరోసారి అండర్ వరల్డ్ హస్తాల్లోకి వెళ్తుందా అనే చర్చా మొదలైంది. ఈ సందర్భంగా.. బాబా సిద్ధిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్దిఖీ హీట్ ఆ హిట్ లిస్ట్ ఉన్నాడని అంటున్నారు.
తాజాగా జీశాన్ ఆఫీసుకు గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది.. ఆ కాలర్ పెద్దమొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడని.. ఇవ్వకపోతే ఎమ్మెల్యేతో పాటు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించాడని అంటున్నారు. దీనిపై ఫిర్యాదు చేయగా.. దీనికి సంబంధించి నోయిడా ప్రాంతంలో 20 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... స్పిరిచ్యువల్ కంటెంట్ క్రియేటర్ అభినవ్ అరోరాకు కూడా బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. తమ కుమారుడు అభినవ్ అరోరాను చంపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరిస్తుందని అతడి తల్లి జ్యోతి తెలిపారు. గత రాత్రి ఓ కాల్ ను మిస్ చేశామని, తర్వాత అదే నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందని వెల్లడించారు.
కాగా... అక్టోబర్ 12న తన కుమారుడి కార్యాలయం పరిశరాల్లో ముగ్గురు దుండగులు, ఆరు రౌడ్లు కాల్పులు జరపడంతో బాబా సిద్ధిఖ్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో... బాబా సిద్ధీఖీని తామే చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో పలువురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే... బాబా సిద్ధిఖీ తోపాటు కుమారుడు జీశాన్ సిద్ధిఖీ ని చంపేందుకు తమకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో జీశాన్ కు తాజాగా ఫోన్ బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో.. స్పిరిచ్యువల్ కంటెంట్ క్రియేటర్ అభినవ్ అరోరాకు కూడా బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్నారు.