ప్రపంచంలో అత్యంత రద్దీ నగరాల్లో మన దేశంలో 2
బెంగళూరు 6 స్థానంలో నిలిస్తే.. ఫూణె 7 స్థానంలో నిలిచింది. గత ఏడాది బెంగళూరులో 10 కి.మీ.
అత్యంత రద్దీగా ఉండే నగరాలకు సంబంధించి ఒక జాబితాను సిద్దం చేశారు. అందులో ప్రపంచ దేశాల్లోని అత్యంత రద్దీగా ఉంటూ.. తీవ్రమైన ట్రాఫిక్ జాంలకు నెలువుగా ఉండే నగరాల్ని ఎంపిక చేశారు. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ గా రూపొదించిన ఈ రిపోర్టులో ఆసక్తికర వివరాల్ని వెల్లడించారు. గత ఏడాది ప్రపంచ దేశాల్లోని వివిధ నగరాల ట్రాఫిక్ ను పరిశీలించిన మీద ఈ నివేదికను సిద్ధం చేశారు.
ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరానికి సగటున 37 నిమిషాలు పడుతుందన్న విషయాన్ని గుర్తించారన్నారు. ఇదే రీతిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో ఐర్లాండ్ కు చెందిన డబ్లిన్.. కెనడాకు చెందిన టొరంటో తర్వాతి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇదే జాబితాలో దేశానికి చెందిన రెండు నగరాలు ఉండటం గమనార్హం.
55 దేశాల్లోని 387 నగరాల్లో 60 కోట్లకు చెందిన ఇన్ కార్ నావిగేషన్ సిస్టమ్ లు.. స్మార్ట్ ఫోన్ ల సమాచారం ఆధారంగా ఈ రిపోర్టును సిద్ధం చేశారు. మన దేశానికి సంబంధించి టాప్ 10 జాబితాలో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు.. మహారాష్ట్రకు చెందిన ఫూణె నగరాలు నిలిచాయి.
బెంగళూరు 6 స్థానంలో నిలిస్తే.. ఫూణె 7 స్థానంలో నిలిచింది. గత ఏడాది బెంగళూరులో 10 కి.మీ. ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టగా.. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇక్కడి వాహనదారులు ఏడాదిలో 132 గంటలు కోల్పోయినట్లుగా చెప్పాలి. సగటు వేగం గంటకు కేవలం 18కి.మీ. మాత్రమే కావటం గమనార్హం.
ఫూణెలో 10కి.మీ. దూరానికి 27.50 నిమిషాలు పట్టగా.. స్థానికంగా వాహనాల వేగం గంటకు 19కి.మీ.లుగా తేల్చారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలు 44, 54 స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు ఫీల్ అవుతాం. తాజా రిపోర్టును చూస్తే.. మనం మిగిలిన నగరాల కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నట్లుగా చెప్పక తప్పదు.