ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలకు బిగ్ షాక్!

ఇటీవల వైసీపీ, టీడీపీలకు చెందిన చెరో నలుగురు ఎమ్మెల్యేలపైనా శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-03-12 05:49 GMT

ఇటీవల వైసీపీ, టీడీపీలకు చెందిన చెరో నలుగురు ఎమ్మెల్యేలపైనా శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అనర్హత వేటు వేసే విషయంలో ఆ పార్టీ, ఈ పార్టీ అనే తారతమ్యాలేమీ లేకుండా తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏపీ శాసనమండలి చైర్మన్ మోషెన్ రాజు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.

అవును... శాసనసభ స్పీకర్ తరహాలేనో శాసనమండలి చైర్మన్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ మారిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపైనా అనర్హత వేటు వేశారు. ఇలా ఫిరాయింపు చట్టం కింద వైసీపీ ఎమ్మెల్సీలు సి. రామచంద్రయ్య, వంశీకృష్ణ య్యాదవ్ లపై వేటు వేయడంతో.. వీరిద్దరూ ఇప్పుడు మాజీలయ్యారు.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన రామచంద్రయ్య టీడీపీలో చేరగా.. వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. ఇలా పార్టీలు మారిన క్రమంలో వైసీపీపై తీవ్ర విమర్శలే చేశారు! ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేశారు కానీ.. ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. దీంతో ఈ విషయంపై శాసన మండలి స్పీకర్ కు ఫిర్యాదు అందింది.

ఈ మేరకు తమ పార్టీకి రాజీనామా చేసి, ఆ పార్టీ ద్వారా దక్కిన పదవులను మాత్రం అనుభవిస్తున్న ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపైనా చర్యలు తీసుకోవాలంటూ మండలి చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.. మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు చైర్మన్ నోటీసులు పంపారు.

అనంతరం ఆ నోటీసులకు సంబంధించి వారు ఇచ్చిన వివరణ తీసుకున్నారు. ఈ క్రమంలో సమగ్ర విచారణ జరిపిన అనంతరం ఆ ఇద్దరిపైనా అనర్హత వేటు వేశారు. దీంతో... ఎమ్మెల్సీలుగా ఇంకా చాలా పదవికాలం ఉన్నప్పటికీ... వాళ్లద్దరూ మాజీలయ్యారు.

Tags:    

Similar News