సనాతన ధర్మం టాపిక్... కరుణానిధి పేరు చెబుతోన్న ఉదయనిధి!

ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపట్ల విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ స్పందించారు.

Update: 2024-10-22 10:28 GMT

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప్రధానంగా ఏపీలో సనాతన ధర్మం గురించిన చర్చ బలంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకంపనలు ఇటీవల తమిళనాడునూ తాకిన పరిస్థితి. ఈ సమయంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై ఆయన తాజాగా స్పందించారు.

అవును... గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో సనాతనధర్మం గురించి చర్చ బలంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే! ఈ ధర్మం గురించి అన్నీ తెలిసినవాళ్లతో పాటు, ఏమీ తెలియని వాళ్లు, సగం సగం తెలిసిన వాళ్లు సైతం మాట్లాడేస్తున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి గతంలో చేసిన వ్యాఖ్యలపట్ల విమర్శలు ఎదుర్కొంటున్న తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్ స్పందించారు.

ఇందులో భాగంగా... సనాతన ధర్మంపై తాను ఏనాడూ విమర్శలు చేయలేదని.. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తాజాగా దిండిగల్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... సనాతన ధర్మంపై కామెంట్ల విషయంలో గతంలో తనపై వచ్చిన విమర్శలను కొట్టిపారేశారు. సనాతనం గురించి మాత్రమే కాదు.. పెరియార్, పెరిరిజ్ఞార్, కళైజ్ఞార్ కరుణానిధి అనుసరించిన విధానాలను ఉటంకించినట్లు గుర్తు చేశారు.

ఈ విషయంలో తనపై కేసులు నమోదు చేశారని.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారని చెప్పిన ఉదయనిధి.. తాను కరుణానిధి మనవడినని.. ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. నాడు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. అవన్నీ పెరియార్, పెరారిజ్ఞార్ వంటివారు చెప్పిన సూక్తులేనని స్పష్టం చేశారు.

తన మాటలను వక్రీకరించినప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పాలని ఉదయనిధి ప్రశ్నించారు. కళైజ్ఞార్ కరుణానిధి మనవడినని, ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. అప్పుడు చెప్పిన మాటలకు తాను కట్టుబడే ఉన్నానని, అవి పెరియార్, పెరారిజ్ఞార్ వంటి మహనీయులు చెప్పిన సూక్తులేనని స్పష్టం చేశారు. దీంతో.. సనాతన ధర్మం విషయంలో డీఎంకే స్టాండ్ ఫిక్స్ అని, ఆ విషయంలో తగ్గేదేలే అని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News