"కూటమిలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పి ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది”!

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టగా.. జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ తో కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు అధికారంలోకి వచ్చింది.

Update: 2024-10-09 12:56 GMT

లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. సుమారు పదేళ్ల తర్వాత జరిగిన జమ్మూకశ్మీర్ ఎన్నికలు ఫలితలు వచ్చేశాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టగా.. జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ తో కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ జట్టు అధికారంలోకి వచ్చింది.

ఇలా ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వడం.. ఒక రాష్ట్రంలో బీజేపీ, మరో రాష్ట్రంలో కాంగ్రెస్ & కో అధికారంలో ఉండటంతో పోటీ టై అయినట్లయ్యింది! ఈ సమయంలో త్వరలో మరో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ సమయంలో అందరి దృష్టీ మహా ఎన్నికపైనే ఉందని అంటున్నారు!

అవును... హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా అన్నట్లుగా బీజేపీ గెలవడంతో... విపక్షంలో ఉన్న పార్టీల ఐకమత్యం ఇప్పుడు అత్యవసరం అనే చర్చ "ఇండియా" కూటమి పార్టీల్లో బలంగా నడుస్తుంది. కాస్త బలం రాగానే కాంగ్రెస్ కు ఒంటరిగా పోటీ చేయాలనిపిస్తుంటుంది.. దెబ్బ తగిలాక బోరు మంటుందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హర్యానాలో అటు సమాజ్ వాదీ పార్టీ కానీ, ఇటు ఆప్ తో కానీ కలిసి ఎన్నికలకు వెళ్లి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవనే చర్చ బలంగా నడుస్తుంది. ఈ సమయంలో... కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఐకమత్యం ఎంతో అవసరం అని.. సీఎం పోస్ట్ విషయంలో కూడా ఎన్నికలకు ముందే ప్రజలకు క్లారిటీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం చాలా ముఖ్యమని అంటున్నారు ఉద్ధవ్ థాక్రే.

మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎస్.హెచ్.ఎస్. కి చెందిన ఉద్ధవ్ థాక్రే.. ఎన్సీపీ కి చెందిన శరద్ పవార్, కాంగ్రెస్ కు చెందిన సోనియా గాంధీ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్ర స్థాయి రాజకీయ సంకీర్ణం అయిన "మహా వికాస్ అఘాడీ" కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరైనా సరే తాను మద్దతు ఇస్తానని ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో... ఒక్కసారిగా మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సమయంలో తనకు కూటమిని గెలిపించుకొవడమే ముఖ్యమని.. మహారాష్ట్రను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని.. ఇదే సమయంలో ఎన్నికలకు ముందే కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటిసే బాగుంటుందని.. అది ఎవరైనా సరే తన మద్దతు ఉంటుందని.. తనకు పదవి కంటే మహారాష్ట్ర క్షేమం ముఖ్యమని అన్నారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టులో జరిగిన మహా వికాస్ అఘాడీ కూటమి సమావేశంలొనే ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు ఉద్ధవ్ థాక్రే. ఇక అన్నీ అనుకూలంగా జరిగితే నవంబర్ లో మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంటున్న నేపథ్యంలో.. ఆయన మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తడం హాట్ టాపిక్ గా మారింది!

Tags:    

Similar News